Begin typing your search above and press return to search.
కేన్స్ 2019: ఏదో మిస్సయ్యిందనుకుంటే!
By: Tupaki Desk | 18 May 2019 10:27 AM GMTకేన్స్ 2019 సంబరాల్లో బాలీవుడ్ అందాల నాయికల హవా గురించి తెలిసిందే. ఇప్పటికే నలుగురు బెస్ట్ బాలీవుడ్ అందగత్తెలు ఈ వేదికపై అల్లాడించారు. రెడ్ కార్పెట్ నడకల్లో భారతీయ బ్యూటీల హవా ఏ రేంజులో ఉంటుందో ప్రత్యక్షంగా చూపించారు. మన అందాలు యూనివర్శల్ అని ప్రూవ్ చేశారు. కంగన.. దీపిక.. ప్రియాంక చోప్రా.. హీనా ఖాన్ .. వీళ్లంతా అదిరిపోయే డిజైనర్ లుక్ తో విభిన్నమైన గెటప్పుల్లో దర్శనమిచ్చారు. ఒక్కొక్కరూ మూడు నాలుగు డిఫరెంట్ డ్రెస్సులతో రెడ్ కార్పెట్ పై అదరగొట్టారు.
అయితే ఎందరు ఎంత చేసినా ఈ ఉత్సవాల్లో ఏదో కళ మిస్సయ్యిందే..! అంటూ అభిమానుల కళ్లు ఆసక్తిగా వెతికాయి. అసలింతకీ కేన్స్ లో ఏం మిస్సయ్యింది? అని వెతికితే ఇదిగో మిసెస్ ఐశ్వర్యారాయ్ గుర్తుకొచ్చింది. అసలు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ లేని కేన్స్ ను ఊహించగలమా? ఆ పండగలో ప్రతియేటా తప్పనిసరిగా సందడి చేసే ఐష్ ఈసారి ఎందుకనో కాస్త ఆలస్యంగానే ఫ్రెంచి రివెరాకు వెళుతోంది. తనతో పాటే బుల్లి ఐష్ ఆరాధ్యను వెంట తీసుకెళుతోంది. గతంలో ఆరాధ్యతో కలిసి పలు రెడ్ కార్పెట్ ఈవెంట్లకు వెళ్లిన ఐష్ తనతో పాటే ర్యాంపుపై నడిచి మైమరిపించారు. ఈసారి ఆరాధ్య సైతం రెడ్ కార్పెట్ పై నడవనుందని అర్థమవుతోంది. అయితే ఇప్పటి నుంచే తనకు మామ్ ఐష్ ట్రైనింగ్ ఇస్తోందనే అర్థమవుతోంది.
కేన్స్ కి వెళుతూ తాజాగా విమానాశ్రయంలో ఐష్ - ఆరాధ్య జోడీ ఇలా కెమెరా కంటికి చిక్కారు. ఐష్ ఓ ప్రత్యేకమైన లుక్ లో కనిపించి షాకిచ్చింది. దీనిని బార్బారా బ్యూ మల్టీ హ్యూడ్ జాకెట్ .. బ్లాక్ బాటమ్ తో కొత్తగా కనిపించింది. ఎయిర్ పోర్ట్ లుక్ తోనే హాట్ డిబేట్ కి తెరతీసిన ఐష్ కేన్స్ లో ఎలాంటి డిజైనర్ డ్రెస్ లో దర్శనమివ్వనుందో వేచి చూడాల్సిందే. ఈనెల 14 నుంచి 25వరకూ దాదాపు 11రోజులు కంటిన్యువస్ గా ఈ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఇక ఇన్నాళ్లు మస్సయినది ఐష్ రాకతో ఫుల్ ఫిల్ అవుతుందేమో చూడాలి.