Begin typing your search above and press return to search.
ఐష్ కుమార్తె భారత ప్రధాని?
By: Tupaki Desk | 25 Jun 2018 7:52 AM GMTమంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటే అవుననే వాళ్లు ఎంతమందో.. కాదనే వాళ్లు అంతే మంది కనిపిస్తారు. కాకుంటే.. నమ్మమంటూనే నమ్మే వారు కనిపిస్తారు. జ్యోతిష్యాలు.. జాతకాలు అంతా బోగస్ అని చెప్పినా.. కొందరు జ్యోతిష్యులు చెప్పే జోస్యాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. అవి నిజం అయిన సందర్భాలు లేకపోలేదు.
గతంలో తాను చెప్పిన పలు జోస్యాలు వాస్తవరూపం దాల్చిన వైనాన్ని చెబుతున్న ప్రముఖ జ్యోతిష్యుడు జ్ఞానేశ్వర్ తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ లెజెండ్ బిగ్ బి అలియాస్ అమితాబ్ మనమరాలు.. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్యకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉన్నట్లుగా ఆయన చెప్పారు.
భారత రాజకీయాల్లో ఐశ్వర్య కుమార్తె ఒక వెలుగు వెలుతుందని.. ఆమె దేశ ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. అయితే.. ప్రస్తుతం ఆరాధ్యగా ఉన్న ఆమె పేరు రోహిణీగా మారిస్తే ఈ ఫలితం ఉంటుందని చెప్పటం గమనార్హం.
ఆరాధ్య తన పేరునురోహిణీగా మార్చుకుంటే దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుందన్నారు. గతంలోనే తాను చెప్పినట్లే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని.. రజనీకాంత్ రానున్న విషయాన్ని గుర్తు చేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తాను ముందే చెప్పానని.. అదే రీతిలో జరిగిందన్నారు. అంతేకాదు.. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాష్ పెళ్లి 2019లో జరుగుతుందని తాను చెప్పానని.. అలానే జరుగుతోందన్నారు. 2024లో భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుందన్న అంచనాను ఆయన చెప్పారు. మరి.. దీనిపై బిగ్ బి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.