Begin typing your search above and press return to search.

దుబాయ్ లో ఐశ్వర్యారాయ్ విల్లా.. అదరహో!

By:  Tupaki Desk   |   30 July 2016 12:43 PM GMT
దుబాయ్ లో ఐశ్వర్యారాయ్ విల్లా.. అదరహో!
X
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీవారికి దుబాయ్ తో మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. షూటింగులకు - షూటింగులు పూర్తయిన తర్వాత హాలిడేస్ లో విహారానికి - షాపింగులకు కూడా బాలీవుడ్ జనాలు ఎక్కువగా ప్రిఫర్ చేసేది దుబాయ్ నే! షూటింగుల్లో ఫుల్ బిజీగా గడిపిన తర్వాత కొన్ని రోజులు ఫ్యామిలీతో సేదతీరడానికి దుబాయ్ కి వెళ్లడం బాలీవుడ్ జనాలకు సర్వసాధారణమైన విషయం. ఇలా బాలీవుడ్ కూ దుబాయ్ కు మంచి అనుబంధం ఉంది. ఫిల్మ్ ఫెస్టివల్సు, ఫ్యాషన్ షోలు ఇలా మొదలైన సినిమా సంబంధిత కార్యక్రమాలకు కూడా దుబాయ్ మంచి వేదిక కావడంతో దుబాయ్ ని మరో ముంబైగా ఫీలవుతుంటారు.

బాలీవుడ్ కూ దుబాయ్ కు ఈ స్థాయి అనుబంధం ఉన్నప్పుడు ముంబైలో సొంతింటి కల నెరవేరిన తర్వాత చాలా మంది బాలీవుడ్ స్టార్స్ నెక్స్ట్ దుబాయ్ లో ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటారు. ఈ విషయంలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ దుబాయ్ రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడులు పెట్టారని చెబుతుంటారు. అయితే తాజాగా బచ్చన్ ఫ్యామిలీ దుబాయ్ లో ఒకవిల్లాను కొన్నారు. ఇంద్ర భవనాన్ని తలదన్నేలా ఉన్న ఆ విల్లా అభిషేక్ - ఐశ్వర్యలకు తెగ నచ్చేసిందట. ఈ విల్లా ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

గతంలో బుర్జు ఖలీఫా లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఒక ప్లాట్ కొన్నాడు. ఇదే క్రమంలో తాజాగా బచ్చన్ ఫ్యామిలీ కూడా ఒక విల్లాను కొన్నారు. షేక్ హోలిండ్ అనే ప్రాజెక్ట్ డెవలపర్స్ ఈ విల్లాను నిర్మించారు. ఇలాంటివి ఇప్పటివరకూ వారు 97 నిర్మించారు. అభి - ఐష్ ల ముద్దుల కూతురు ఆరాధ్య కోసం ఈ విల్లాను కొన్నారని, ఆ విల్లాలో ఆరాధ్య మహారాణిలా తిరుగుతుంటే చూసి మురిసిపోవాలని ఈ జంట ఆశపడుతుందట. అయితే అద్భుతంగా ఉన్న ఈ విల్లాకు ఎంత ఖర్చు అయ్యిందో చెప్పడం లేదు కానీ.. దుబాయ్ లో ఏ విషయంపై పెట్టుబడిపెట్టినా అది ప్లస్సే కాని మైనస్ కాదు కదా అనేది అభి-ఐష్ దంపతుల ఆలోచనట!