Begin typing your search above and press return to search.

వాళ్ళే అతి పెద్ద సీఈవోలు అంటున్న ఐష్!

By:  Tupaki Desk   |   4 Aug 2018 6:03 AM GMT
వాళ్ళే అతి పెద్ద సీఈవోలు అంటున్న ఐష్!
X

ఒలింపిక్ పతకం సాధిస్తేనో లేదంటే పెద్ద పెద్ద వ్యాపారాలను ఒంటి చేత్తో నడిపితేనే మహిళలను గ్రేట్ అనుకుంటాం. అదే ప్రతి ఇంట్లో ఉన్న గృహిణులను తక్కువగా చూస్తాం. వాళ్ళు ఎన్నో రకాల పనులను చాకచక్యంగా చక్కబెడుతూ అటు ఇంటిని - పిల్లలను.. ఇంట్లో ఉండే పెద్దలను కూడా కంటికి రెప్పలా కాపాడుతుంటారు. భర్తకు వీలైనంతగా శ్రమ తగ్గించి చేదోడువాదోడుగా నిలుస్తారు. సెలవనేదే లేకుండా కష్టపడేవాళ్ళకు దక్కే ప్రతిఫలం ఏంటంటే.. 'అదేమీ గొప్ప కాదు. అందరూ చేసేదే కదా' అనే చులకనతో కూడిన కామెంట్. కానీ అదే గృహిణుల గురించి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఒక్క ముక్కలో అద్భుతంగా చెప్పింది.

'ఇండియన్ ఐడాల్-10' వీకెండ్ షో కు 'ఫ్యానీ ఖాన్' లీడ్ యాక్టర్లైన అనిల్ కపూర్ - ఐశ్వర్య రాయ్ - రాజ్ కుమార్ రావు లు అతిథులు గా హాజరయ్యారు. ఆ షోలో ఓ కాంటెస్టెంట్ అయిన ఇందిరా దాస్ తన పాట పాడిన తర్వాత , ఇందిరా అమ్మగారు మాట్లాడుతూ ఐశ్వర్య రాయ్ ను "మనదేశం లో ఉండే గృహిణులపై మీ అభిప్రాయం ఏంటి?" అని అడిగింది. ఐశ్వర్య సమాధానమిస్తూ "ఈ దేశంలో అతి పెద్ద సీఈవో లు గృహిణులే.. వాళ్ళను ఈదేశం లో ఉండే ప్రతి ఒక్కరు ఎంతో గౌరవించాలి. వాళ్ళను ఎంత పొగిడినా తక్కువే. నేను ఈ దేశం లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే హౌస్ వైఫ్ లందరికీ నా శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను" అని చెప్పింది.

ఇక అలా అన్న తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. చప్పట్లతో ఆడిటోరియం మార్మోగిపోయింది. అ తర్వాత 'ఇండియన్ ఐడాల్' జడ్జ్ లలో ఒకరైన విశాల్ దాడ్లాని మాట్లాడుతూ "ఐశ్వర్య గారు ప్రపంచ సుందరి మాత్రమే కాదు ఆవిడా ఓ అద్భుతమైన గృహిణి. ఒక సారి వరల్డ్ మ్యూజిక్ టూర్ లో ఉన్నపుడు, అమితాబ్ బచ్చన్ జీ మా టీమ్ ను డిన్నర్ కు ఆహ్వానించారు. అక్కడ ఐశ్వర్య తన స్వహస్తాలతో అందరికీ వడ్డించింది. ప్రతిఒక్కరూ తింటున్నారా లేదా అని గమనిస్తూ ఎంతో గొప్ప ఆతిధ్యం ఇచ్చింది. అంతే కాదు.. డిన్నర్ పూర్తయిన మేమంతా ఐస్ క్రీములు తిన్న తర్వాత కాని ఆమె తన డిన్నర్ చేయలేదు." అంటూ ఐశ్వర్య ఎంత గొప్ప గృహిణి అనే విషయం వివరించాడు. సూపర్ కదా..!