Begin typing your search above and press return to search.

అత్త భుజాలపై సేద తీరుతున్న ఐష్

By:  Tupaki Desk   |   7 Jan 2017 4:58 AM GMT
అత్త భుజాలపై సేద తీరుతున్న ఐష్
X
ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఫ్యామిలీకి కోడలు అయ్యాక.. ముఖ్యంగా తాజాగా ఐష్ నటిస్తున్న సినిమాలు.. వాటిలోని కంటెంట్ కారణంగా ఆ కుటుంబంలో విబేధాలు అంటూ బోలెడన్ని రూమర్లు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రొమాంటిక్ సీన్స్ విషయంలో ఐశ్వర్య పై జయా బచ్చన్ అసంతృప్తి వ్యక్తం చేశారనే టాక్ వినిపించింది.

తాజాగా జరిగిన స్టార్ డస్ట్ అవార్డుల కార్యక్రమంలో జయా బచ్చన్-ఐశ్వర్యల మధ్య సఖ్యత చూస్తే.. ఇలాంటి వాళ్ల నోళ్లు మూత పడాల్సిందే. వారిద్దరూ అన్యోన్యంగా మాట్లాడుకోవడం.. కూర్చున్న తీరు.. ఐశ్వర్యను అక్కున చేర్చుకున్న జయను చూస్తే.. వీళ్లు అత్తా కోడళ్లా.. అమ్మాకూతుళ్లా అనిపించక మానదు. మొహం నిండా అలసట నిండిపోయిన ఐశ్వర్య.. జయాబచ్చన్ చేతిని పట్టుకుని.. ఆమె భుజం వాలిపోతే.. ఊరడిస్తోంది ఆ అత్తయ్య. ఈ ఒక్క ఫోటో.. అత్తా కోడళ్ల మధ్య విబేధాలు అన్న మాటలన్నిటికీ చెక్ పెట్టేసింది.

ఇదే స్టార్ డస్ట్ అవార్డ్ ఈవెంట్లో.. సరబ్ జిత్ చిత్రానికి గాను ఐశ్వర్యారాయ్ కు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ రాగా.. ఆ అవార్డును భర్త అభిషేక్ తోనే కలిసి అందుకుంటానని పట్టుబట్టింది ఐష్. అంతే కాదు.. ఆ అవార్డ్ ఇచ్చిన వ్యక్తి కూడా మామగారైన అమితాబ్ బచ్చన్ కావడం విశేషం. బచ్చన్ ఫ్యామిలీలో సఖ్యత ఏ రేంజ్ లో ఉంటుందో.. ఈ ఈవెంట్ ప్రపంచానికి చూపించింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/