Begin typing your search above and press return to search.
ఐష్ ఫ్యాన్స్ కి '2.ఓ' ట్రీట్
By: Tupaki Desk | 30 Sep 2018 6:02 AM GMTరోబోకి సీక్వెల్ - ప్రీక్వెల్ కాని సినిమాగా 2.ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని శంకర్ తెలిపారు. ఇదో పూర్తి డిఫరెంట్ కథాంశంతో ఉంటుందని ప్రారంభంలోనే ప్రకటించారు. అయితే రోబో ఘనవిజయంలో కీలక పాత్ర పోషించిన చిట్టీ పాత్రకు ఎక్స్ టెన్షన్ మాత్రం 2.ఓలో ఉంది. చిట్టీ ఈజ్ బ్యాక్! అన్న ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు. ఇదివరకూ రిలీజ్ చేసిన టీజర్ లోనూ చిట్టీ రోల్ ఏంటి? అన్నది రివీల్ చేశారు. భూమండలంపైకి దూసుకొస్తున్న పెను విధ్వంశకారి అయిన క్రోమ్యాన్ ని ఆపడమే చిట్టీ పని. అంటే చిట్టీ మంచోడైపోయాడని అనుకోవచ్చు. ఇకపోతే చిట్టీని వెనక్కి తెచ్చింది ఎవరు? అంటే వశీకరణ్(రజనీ). వశీకరణ్ ఉన్నాడంటే అతడి భార్య ఐశ్వర్యారాయ్ ని బరిలో దించాల్సి ఉంటుంది.
సరిగ్గా ఇదే పాయింట్ తో ఐసూని వెనక్కి తెచ్చి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడట శంకర్. 2.ఓలో ఐశ్వర్యారాయ్ ఓ ఎమోషనల్ సీన్ లో కనిపించి ఆకట్టుకుంటుందని ప్రచారం సాగుతోంది. వశీకరణ్ ని ప్రేమించి - చిట్టీ రోబో వేధింపుల్ని భరించిన ఐసూ పాత్ర 2.ఓ చిత్రంలో ఎన్ని సీన్లకు పరిమితం? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఐష్ పాత్రతో 2.ఓ చిత్రానికి అదనపు మెరుపులు అద్దాలని శంకర్ ప్లాన్ చేశారట. అయితే ఐసూ ఎంట్రీని మాత్రం ఇప్పటివరకూ సస్పెన్స్ లోనే ఉంచారు ఎందుకనో. వసు అలియాస్ ఐసూ ఈజ్ బ్యాక్! అన్న ప్రచారంతో మెరుపులు మెరిపిస్తారేమోనని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్.
మరోవైపు 2.ఓ ట్రైలర్ ని శంకర్ బృందం పకడ్భందీగా రెడీ చేస్తున్నారు. అంతకుముందే అక్షయ్ కుమార్ పాత్రను హైలైట్ చేస్తూ ఓ విధ్వంశకర టీజర్ ని రిలీజ్ చేసే ప్లాన్ ఉందిట. తొలి టీజర్‌లో అక్కీని తక్కువ చేశాడని విమర్శలు ఎదుర్కొన్న శంకర్ ఈరకంగా విరుగుడును ప్లాన్ చేస్తున్నారట. ఇక ట్రైలర్ అంటే పూర్తి స్థాయిలో మజా తెచ్చేది కాబట్టి, అందులో అన్ని పాత్రల్ని ఎలివేట్ చేయాల్సి రావొచ్చు. ఇక ఇప్పటివరకూ అసలు ఎమీజాక్సన్ కి సంబంధించిన ఏ విజువల్ బయటకు రాలేదు. అప్పట్లో రోబో గెటప్ లో ఎమీ డ్యాన్సులేస్తున్న ఓ మేకింగ్ వీడియోని మాత్రం లీక్ చేశారు. అది తప్ప అధికారికంగా ఎమీజాక్సన్ పాత్రకు సంబంధించిన లీకేజీ లేదు. ఎలానూ నవంబర్ 29న సినిమా రిలీజవుతోంది కాబట్టి అక్టోబర్-నవంబర్ లో 2.ఓ ప్రచార సామాగ్రి నుంచి బోలెడన్ని విజువల్ గ్లింప్స్ అభిమానులు వీక్షించే ఛాన్సుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికి 2.ఓ ట్రైలర్ - టీజర్లు రెడీ అవుతున్నాయని తెలుస్తోంది. 2010లో `రోబో` (ఎంథీరన్) రిలీజైంది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు `2.ఓ` రిలీజవుతున్న సంగతి తెలిసిందే.