Begin typing your search above and press return to search.
జాస్మిన్ లో ఐష్ చేస్తుందా? లేదా?
By: Tupaki Desk | 15 May 2018 11:30 PM GMTదేశంలో సరోగసీ ద్వారా బిడ్డలను పొందుతున్న జంటల సంఖ్య అధికంగా ఉంది. అంతెందుకు సెలెబ్రిటీలలోనూ చాలా మంది సరోగసీ పద్దతిలో పిల్లల్ని కన్న వారే. అది ఒక వ్యాపారంగా మారిపోయింది. పేద తల్లులకు డబ్బులు ఆశ చూపి వారి గర్భాన్ని అద్దెకు తీసుకుంటున్నారు. ఈ సమస్యే కథాంశంగా ఇంతవరకు ఒక్క సినిమా రాలేదు. ఇదిగో ఇప్పుడు అన్నీ కలిసొస్తే ఐష్ సరోగసీ మదర్ గా కనిపించే అవకాశం ఉంది.
టాయిలెట్ః ఏక్ ప్రేమ్ కథా డైరెక్టర్ శ్రీ నారాయణ సింగ్ జాస్మిన్ పేరుతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. ఏ స్టోరీ ఆఫ్ ఏ లీస్డ్ ఊంబ్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఓ అద్దె గర్భం కథ అని ఆ క్యాప్షన్‌కు అర్థం. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ ను పెట్టి సినిమా తీయాలని ప్లాన్ చేశాడు. విషయం ఐష్ కు చేరింది. కథ చదివిన ఆ సుందరి కథను కాస్త మార్చి తిరిగి రాస్తే అప్పుడు తన అభిప్రాయం చెబుతానని మెలిక పెట్టింది. తాను ఆ సినిమా చేస్తానా చేయనా అనేది వారు రాస్తే స్క్రిప్టు మీదే ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని కేన్స్ నుంచి వీడియో కాల్ ద్వారా చెప్పింది. ముందుగా రాసుకున్న స్ర్కిప్టు ఆమెకు పెద్దగా నచ్చలేదని సమాచారం. అందుకే మార్పులు చేర్పులు కోరిందని తెలుస్తోంది. సో కొన్ని రోజుల్లో జాస్మిన్ గా కనిపించేది ఎవరో తేలిపోతుంది.
ఈ సినిమా కాకుండా ఐష్ చేతుల్లో ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి. 1967లో వచ్చిన రాత్ అవుర్ దిన్ 1964లో వచ్చిన ఓ కౌన్ థి సినిమాలను రీమేక్ చేయాలని క్రియార్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్ణయించింది. వాటి గురించి కూడా ఐష్ మాట్లాడుతూ తాను ఇండియా వచ్చాక ఆ సినిమాల గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. సినిమా టీమ్ గురించి కూడా తెలుసుకోవాలని చెప్పింది. ఆ సినిమాలను దర్శకులు ఇప్పటి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎలా తీస్తారో కూడా తెలుసుకోవాల్సి ఉందని తెలిపింది. అన్నీ కుదిరితే సినిమాలో చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తానని చెప్పింది