Begin typing your search above and press return to search.

అంబానీ ల‌వ్ లో ఐశ్వ‌ర్యారాయ్?

By:  Tupaki Desk   |   23 Jun 2020 2:30 AM GMT
అంబానీ ల‌వ్ లో ఐశ్వ‌ర్యారాయ్?
X
ఐశ్వ‌ర్య‌రాయ్ కెరీర్ జ‌ర్నీ ఎఫైర్ మ్యాట‌ర్స్ గురించి ప్ర‌త్యేకించి తెలియాల్సిందేమీ లేదు. ప్ర‌తిదీ ఓపెన్ సీక్రెట్. 2004 నాటికే ఐష్ పెద్ద స్టార్. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు అందుకుంది. హమ్ దిల్ దే చుకే సనమ్- తాళ్‌- దేవదాస్- మొహబ్బతేన్ వంటి హిట్స్ ఇచ్చిన తరువాత ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ లోనే ది బెస్ట్ స్టార్ గా ఎదిగారు. ప‌రిశ్ర‌మ‌లో అంద‌రు అగ్ర నిర్మాత‌లు.. ద‌ర్శ‌కుల‌తోనూ ప‌ని చేసింది.

ఇక కెరీర్ ఎదిగే క్ర‌మంలోనే స‌ల్మాన్ ఖాన్ తో ప్రేమాయ‌ణం తెలిసిందే. ఆ ప్రేమ అనూహ్యంగా బ్రేక‌ప్ అయ్యింది. ఐష్ విష‌యంలో స‌ల్మాన్ ఎంతో దురుసుగా వ్య‌వ‌హ‌రించ‌డంపైనా మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ బ్రేక‌ప్ కి మ‌రో స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ కార‌ణం అని కూడా ప్ర‌చార‌మైంది. ఒబేరాయ్ తో ఐష్ డేటింగ్ పుకార్లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయ్యాయి. ఆ సమయంలో ఆమె సల్మాన్ ఖాన్ ‌తో ఊహించ‌ని ఎపిసోడ్ ను ఎదుర్కోవ‌డం వార్త‌ల్లోకొచ్చింది.

అటుపైనా ఐశ్వ‌ర్యారాయ్ పై పుకార్లు ఆగ‌లేదు. ఆమె ప్ర‌ముఖ బిజినెస్ మేన్ అనీల్ అంబానీతోనూ ఎఫైర్ సాగిస్తోంద‌న్న పుకార్లు షికారు చేశాయి. ఏవో బిజినెస్ వ్య‌వ‌హారాల్లో ప్ర‌క‌ట‌న‌ల కోసం క‌లిసేందుకు వెళితే బాలీవుడ్ మీడియా అలా ప్ర‌చారం చేసింది. ఇదే సంగ‌తిని ఆ త‌ర్వాత ఐశ్వ‌ర్యారాయ్ మీడియాకు వెల్ల‌డించారు. అయితే త‌న‌పై ఇటువంటి పుకార్లు ఐశ్వర్యను కలవరపెట్టాయి. ప్ర‌తిసారీ ఇలా మీ టీఆర్పీ ఆట‌లో న‌న్నే ఎందుకు పావును చేస్తారు? అంటూ ఐశ్వ‌ర్యారాయ్ మీడియాపై చాలా సీరియ‌స్ అయ్యారు.

అంబానీల‌ను క‌లిసేది చాలా అరుదు. ఓసారి భ‌ర‌త్ షా పుట్టిన‌రోజు వేడుక‌లో క‌లుసుకున్నాం. అనీల్ అంబానీ - టీనా జంట‌తో పాటుగా ఓ టేబుల్ వ‌ద్ద కూచుని ఉన్నాం. ఆ త‌రవ‌త‌నే నాకు అంబానీల‌తో కోట్లాది రూపాయ‌ల డీల్ ఉంద‌ని సాగించిన ప్ర‌చారంతో షాక్ కి గుర‌య్యాను అని కూడా ఐష్ అన్నారు. నేను నా వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడైనా మాట్లాడానా? ఎవ‌రి ఊహాగానాలు వారికి వ‌దిలేశాను అని ఐష్ అన్నారు ఓ సంద‌ర్భంలో. ఐశ్వ‌ర్యారాయ్ `గురు` సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు అభిషేక్ బ‌చ్చ‌న్ తో ప్రేమ‌లో ప‌డ్డారు. అటుపై ఆ జంట‌కు వివాహం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌కు ఆరాధ్య అనే గారాల కూతురు ఉంది.