Begin typing your search above and press return to search.

తండ్రి కాదు దేవ‌దూత.. ఐష్ ఎమోష‌న్

By:  Tupaki Desk   |   19 March 2020 7:30 AM GMT
తండ్రి కాదు దేవ‌దూత.. ఐష్ ఎమోష‌న్
X
తండ్రికి కూతురు ద‌గ్గ‌ర‌.. త‌ల్లికి కొడుకు ద‌గ్గ‌ర! అని అంటారు. ఎల‌క్ట్రాన్- ప్రోటాన్ అనుబంధానికి ప్ర‌తీక‌ అన్న‌మాట‌. ఆ మాట‌కొస్తే ఐశ్వ‌ర్యాయార్ బ‌చ్చ‌న్ కి నాన్న అంటే ప్రాణం. ఆమె తండ్రి కృష్ణరాజ్ రాయ్ మర‌ణాన్ని త‌ను ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతోంది. తండ్రి జ్ఞ‌ప్తికి వ‌చ్చిన మ‌రుక్ష‌ణం ఐష్ ఎంతో ఎమోష‌న్ అయిపోతుంటుంది. ``నాన్న‌గారు సంరక్షక దేవదూత`` అంటూ కృష్ణ‌రాజ్ జ‌యంతి సంద‌ర్భంగా ఐష్ ఉద్వేగానికి గుర‌య్యారు. చిన్న‌ప్ప‌టి నుంచి త‌న‌ తో ఉన్న అనుబంధం అలాంటిది.

ఐష్ ఈ సంద‌ర్బంగా త‌మ ఫ్యామిలీ ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో అభిమానులకు షేర్ చేశారు. వాటికి ఆస‌క్తిక‌ర కొటేష‌న్స్ ని ఇచ్చారు. కృష్ణరాజ్ రాయ్ ఫోటో ఫ్రేమ్ ముందు ఐష్ ఫ్యామిలీ ఓ ఫోటో దిగింది. ఇందులో త‌న‌తో పాటు కుమార్తె ఆరాధ్య.. భర్త అభిషేక్ బచ్చన్ ఉన్నారు. వేరొక ఫోటోలో తల్లి బృందా రాయ్ - సోదరుడు ఆదిత్య ఉన్నారు. ఆరాధ్య‌తో పాటు ఐష్ దిగిన ఫోటోలు ఉన్నాయి.

``డాడీ మా సంరక్షక దేవదూత ఎల్లప్పుడూ`` అంటూ ఈ సంద‌ర్భంగా ఐష్‌ ఎమోష‌న్ అయ్యింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ తరచూ తన తండ్రి చిత్రాలను సోషల్ మీడియా లో పంచుకుంటారు. గత సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా.. కృష్ణరాజ్ రాయ్ ఫోటో ముందు కుమార్తె ఆరాధ్య తో పాటు తాను ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఆమె తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. తన తల్లి తండ్రి కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఆ త్రోబ్యాక్ ఫోటోకి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించింది. ``మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉన్నాను. 50వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నా బంగారు దేవదూతలు`` అంటూ వ్యాఖ్య‌ను జోడించింది. సృష్ఠిలో అమ్మానాన్న‌ను మించిన దేవ‌త‌లు ఎవ‌రుంటారు? మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ అందుకు అతీతం కానే కాదు.

ఇక ఐష్ కెరీర్ ఎందుక‌నో ఇటీవ‌ల టేకాఫ్ కావ‌డం లేదు. త‌ను తిరిగి రాణించేది ఎప్పుడో అంటూ ఫ్యాన్స్ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అలాగే అమితాబ్ వార‌సుడే అయినా స్మాల్ బి అభిషేక్ బ‌చ్చ‌న్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉండ‌డం ఇబ్బందిక‌రంగానే మారింది. 2018 `ఫ్యానీ ఖాన్` చిత్రంలో న‌టించిన ఐష్ త‌దుపరి అనురాగ్ కశ్యప్ `గులాబ్ జామున్` లో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించనుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ రివీల్ కావాల్సి ఉంది.