Begin typing your search above and press return to search.
ఐశ్వర్య కన్నీటిని ఆపేవారెవరు?
By: Tupaki Desk | 19 March 2017 8:19 AM GMTప్రముఖ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె కంటి నుంచి జలజలా కారుతున్న కన్నీటిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. తాను ఎంతగానో ప్రేమించిన తండ్రి కృష్ణరాజ్ రాయ్ కన్నుమూయడంతో ఐశ్వర్య కంటికిమింటికి ఏకధారగా రోదిస్తున్నారట.
కాగా కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కృష్ణరాజ్ రాయ్ ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో నిన్న తుది శ్వాస విడిచారు. జనవరిలో అస్వస్థతకు గురికావడంతో ఆయనను లీలావతి హాస్పిటల్ చేర్పించి చికిత్సనందిస్తున్నారు. కృష్ణరాజ్ రాయ్‌కి భార్య విందా, కుమారుడు ఆదిత్య, కూతురు ఐశ్వర్యరాయ్ ఉన్నారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా ఆమె హోళీ వేడుకలకు దూరంగా ఉన్నారు.
మరోవైపు తన మామ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనే సమాచారంతో ఇటీవల అభిషేక్ బచ్చన్ న్యూయార్క్ నుంచి హుటాహుటిన ముంబైకి చేరుకొన్న సంగతి తెలిసిందే. కృష్ణరాజ్ మరణించే సమయానికి ఆయన ముంబైలోనే ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/