Begin typing your search above and press return to search.
స్టార్ తల్లీకూతుళ్ల ముద్దూ ముచ్చట్లు
By: Tupaki Desk | 14 May 2018 7:09 AM GMTమదర్స్ డేను అందాల సుందరి ఐశ్వర్యరాయ్ బాగానే ఎంజాయ్ చేసింది. రోజంతా కూతురితోనే గడిపింది. అంది అంతర్జాతీయ వేదికైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో. అమ్మ చేయి పట్టుకుని ఆరాధ్య కూడా రెడ్ కార్పెట్ పై నడిచింది. మదర్స్ డే సందర్భంగా ఐష్ పోస్టు చేసిన ఫోటో తల్లీ కూతుళ్ల మధ్య ప్రేమానుబంధానికి ప్రతీకలా ఉంది.
ఐశ్వర్యారాయ్ వరుసగా పదిహేడోసారి కేన్స్ ఉత్సవాలలో రెడ్ కార్పెట్ పై నడిచింది. ఈసారి మాత్రం ఆమెకు చాలా ప్రత్యేకం. తన ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి అదిరిపోయే డ్రెస్సుల్లో ప్రపంచ వేదికపై మెరుపులు మెరిపించింది. ఆరాధ్య కూడా ఏం తగ్గకుండా కట్టిపడేసే కాస్ట్యూమ్స్ ను వేసుకుంది. అమ్మకు పోటీగా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. సరిగ్గా మదర్స్ డే నాడు తన చిట్టి తల్లికి ఐశ్వర్య ముద్దు పెడుతూ ఫోటో దిగింది. ఆ ఫోటోను కొత్తగా తెరిచిన తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఫ్యాషన్ ఐకాన్స్ లా ఉన్న ఇద్దరి ఫోటో బాగానే ట్రెండవుతోంది. ఆ ఫోటోకు ఐష్ ఎలాంటి పరిమితులు లేకుండా ప్రేమిస్తాను... ప్రపంచంలోనే అత్యంత సంతోషపూరితమైన తల్లిని నేను అని కామెంట్ పెట్టింది.
ఐశ్వర్యకు ప్రస్తుతం 44 ఏళ్లు కాగా ఆరాధ్యకు ఆరేళ్లు. తండ్రితో కన్నా తల్లితోనే ఆరాధ్యకు అనుబంధం ఎక్కువలా కనిపిస్తుంది. ఆరాధ్య పుట్టినప్పటి నుంచి ఐష్ జీవితమే మారిపోయింది. ఎంత దూరం వెళ్లినా కూతురిని వెంట తీసుకెళ్తుంది కానీ ఎవ్వరి దగ్గర వదిలి పెట్టదు. తనకు అన్నింటికన్నా తన కూతురే ముఖ్యమని ఇప్పటికే చెప్పకనే చెబుతోంది ఐష్. ఆమెకే కాదు ఏ తల్లి కైనా బిడ్డలను మించిన ఆస్తి లేదు - ఉండదు కూడా.