Begin typing your search above and press return to search.

అలా చెప్పుకుంటోంది ఐశ్వర్య రాయ్

By:  Tupaki Desk   |   19 Aug 2017 7:36 AM GMT
అలా చెప్పుకుంటోంది ఐశ్వర్య రాయ్
X
ప్రపంచ సుందరిగా పేరుగాంచి.. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాయ్. మొదట బాలీవుడ్ - కోలీవుడ్ లో నటించి ఆ తర్వాత హాలీవుడ్ స్థాయిలో కూడా కొన్ని సినిమాలతో తన నటనతో మరియు అందాలతో ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంది ఈ సుందరి. అయితే అభిషేక్ బచ్చన్ ని వివాహమాడిన తర్వాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా ఆ తర్వాత మళ్లీ తన సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

సినిమాలు చేయకున్నా సరే అప్పుడప్పుడూ బాలీవుడ్ - హాలీవుడ్ లో నిర్వహించే కొన్ని వేడుకలకు హాజరై అందరి చూపుని తనవైపు తిప్పుకుంటోంది. అయితే రీసెంట్ ఈ అమ్మడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు హాలీవుడ్ లో సినిమాలు చేయడం వంటి వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాను హాలీవుడ్ లో నటించినంత మాత్రాన భారతీయ సినిమాలను వదులుకోలేనని గట్టిగా చెప్పేసింది. ఇక్కడ చాలా గొప్ప గొప్ప దర్శకులతో పని చేశాను అంటూ.. ఎన్నో చిత్రాల్లో తన నటనకు ప్రశంశలను కూడా అందుకున్నట్లు తెలిపిందిలే. అలాగే హాలీవుడ్ లో నటించడం చాలా గొప్ప విషయమని బాలీవుడ్ కి చెందిన చాలా మంది హాలీవుడ్ లో నటించారని చెప్పుకొచ్చింది. నటులనే వారు ఒక భాషకు చెందినవారు కాదు అంటూ.. ఇతర భాషల్లో కూడా నటిస్తే ఇక్కడి వారికి గర్వకారణమని కూడా తెలిపింది.ఇక ప్రియాంక చోప్రా - దీపిక పదుకొణె - ఇర్ఫాన్‌ ఖాన్‌ బాలీవుడ్‌ తో పాటు హాలీవుడ్‌ లోనూ నటించి వారి టాలెంట్ ను చూపించుకున్నారు. అందుకు వారిని అభిందించాలని వివరించింది ఐష్.

అయితే ఎన్నో చిత్రాల్లో నటించిన తాను ప్రస్తుతం కొంత మంది ఐశ్వర్య అప్పటిలా నటించడం లేదని అంటున్నారు.. ఐశ్వర్య బ్యూటీలో నే కాకుండా యాక్టింగ్ లో కూడా అదరగొట్టగలదని చెబుతోంది ఈ అమ్మడు. అందుకు తాను పెళ్లి తర్వాత నటించిన సరబ్‌జీత్‌- యే దిల్‌ హై ముష్కిల్‌ సినిమాలే సాక్ష్యాలు అని వివరించింది. తన గురించి తాను అలా చెప్పేసుకుంటోంది ఐశ్వర్య రాయ్.