Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి:. క్వీన్లీ లుక్‌ లో సీనియర్‌ క్వీన్‌

By:  Tupaki Desk   |   16 May 2016 9:30 AM GMT
ఫోటో స్టోరి:. క్వీన్లీ లుక్‌ లో సీనియర్‌ క్వీన్‌
X
ఐశ్వర్యారాయ్.. ఈ అందగత్తె మిస్ వరల్డ్ కిరీటం అందుకుని 20ఏళ్లు దాటిపోయిందంటే.. ఇప్పుడు నమ్మడం చాలా కష్టం. టీనేజ్ లో ఉన్న లుక్ తోనే ఇప్పుడూ ఉందని అనలేం కానీ.. అందం పాళ్లు కొంచెం తగ్గినా.. వయసు రీత్యా వచ్చిన మెచ్యురిటీ.. ఐష్ లో అందాన్ని మరింత ఇనుమడింప చేసింది. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ పడే అందంతో.. అభిమానులకు పిచ్చెక్కిస్తోంది ఐశ్వర్యారాయ్ బచ్చన్.

ఫిలింఫేర్ మేగజైన్ కి జూన్ నెల కవర్ పేజ్ పై ఎక్కేసింది ఐశ్యర్య. సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత.. సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన ప్రతీ పాత్రతోనూ ఆకట్టుకుంటున్న ఐష్ పై.. ఈ ఎడిషన్ లో స్పెషల్ కవరేజ్ ఉంది. ఇందుకోసం 'ది క్వీన్ ఈజ్ బ్యాక్' అంటూ ట్యాగ్ లైన్ వేసి.. ఐశ్వర్యారాయ్ ను అత్యద్భుతంగా కవర్ పై ప్రింట్ చేసింది ఫిలిం ఫేర్. లూజ్ గా వదిలేసిన హెయిర్ - పలు రంగుల్లోని గులాబీల డిజైన్ తో ఉన్న డ్రస్.. వీటిన్నిటికీ ముంచి తదేకంగా ఐశ్యర్య లుక్ తో.. కవర్ పేజ్ భలేగా ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా అయితే ఐశ్యర్య కళ్లు. బాబోయ్ ఆ కళ్లలో ఉన్న మత్తుకి అభిమానులే కాదు ఎవరైనా సరే ఫ్లాట్ అయిపోవాల్సింది. అందుకే వారెవా ఐషు ఫేసు.. అంటూ ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. 22 ఏళ్ల క్రితం ప్రపంచసుందరిగా మెరిసిన ఈ 42 ఏళ్ల సుందరాంగి.. ఇప్పటికీ ఫ్యాన్స్ ను అంతే అందంతో కట్టిపడేస్తోంది. ఇంతకీ 20వ తారీఖున రిలీజ్‌ అవుతున్న అమ్మడి సారబ్జిత్‌ ఏమవుతుందో మరి.