Begin typing your search above and press return to search.

హైప్ తప్ప ఏముందక్కడ.. ఐష్?

By:  Tupaki Desk   |   3 Aug 2015 6:47 AM GMT
హైప్ తప్ప ఏముందక్కడ.. ఐష్?
X
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్... రీ ఎంట్రీపై బోలెడు వార్తలు. అదో పెద్ద హాట్ టాపిక్. ఐదేళ్ల క్రితం గుజారిష్‌‍ లో ఆఖరిసారి కనిపించిన ఐష్... మళ్లీ 5 ఏళ్ల తర్వాత జాజ్‌ బా తో తెరపై కనిపించనుంది. ఇంతకీ ఐష్ తెరపై ఎలా ఉంటుంది? మునుపటి మెరుపుల అందంతోనే కనిపిస్తుందా ? గతానికి మరిన్ని మెరుగులు అద్దుతుందా ? ఇలా ఆన్ లైన్‌ లో డిబేట్లు కూడా నడిచాయి. అంత సీన్ లేదనే విషయం ఇప్పుడు అర్ధమైపోతోంది.

ఐష్... అంటేనే ఐస్. ఐశ్యర్యారాయ్‌ కి కళ్లే ఆకర్షణ. ఆమె కళ్లు... వాటిలో మెరుపులే.. ఆమె అందాన్ని ఇనుమడింప చేస్తాయి. కానీ తాజాగా హలో అనే ఓ మేగజైన్ వందో ఇష్యూలో.... కవర్ పేజ్ పై దర్శనమిచ్చిన ఐష్.. అభిమానుల్లో నీరసాన్ని పుట్టించింది. ఏళ్ల తర్వాత మరింత నాజూకుగా, పొందికగా కనిపిస్తుందని భావించిన ఫ్యాన్స్‌ కు.. మేగజైన్ పై ఆమె కళ్లు చూడగానే ఏడుపొచ్చినంత పనైంది. ఆ ఐష్.. ఈ ఫోటోలో ఉన్నది ఒకరే అని పోల్చుకోవాలంటే... ఆమె కళ్ల వంక మాత్రం చూడకూడదు అనిపించేలా ఉంది.

బ్యూటిఫుల్ ఐస్ లేని ఐశ్వర్యారాయ్ ని చూడ్డమంటే.. కష్టమే మరి. వింటున్నావా ఐష్. నీకోసం సుదీర్ఘకాలం ఎదురుచూసిన అభిమానులు ఇప్పుడు డీలా పడ్డారు. ఫేస్‌లో ఫ్రెష్‌ నెస్ కనిపించడం ఎలాగూ సాధ్యం కాదు... కనీసం కళ్లలో అయినా కమిట్మెంట్ కనిపిస్తే చాలు. కానీ... రీఎంట్రీ పై వస్తున్న హైప్‌ కి అనుగుణంగా.. ఐశ్వర్య లేదనే విషయం ఇప్పుడు స్పష్టమయిపోతోంది.