Begin typing your search above and press return to search.
#మీటూ ఊపందుకోవడం మంచి పరిణామం
By: Tupaki Desk | 10 Oct 2018 5:35 AM GMTదేశవ్యాప్తంగా జరుగుతున్న #మీటూ చర్చలపై బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ స్పందించింది. లోరియల్ ప్యారిస్ వారి న్యూ మేకప్ లైన్ ఫెస్టివల్ కలెక్షన్స్ లో భాగంగా కోల్ కతా లో మాట్లాడుతూ #మీటూ ఊపందుకోవడం మంచి పరిణామని చెప్పింది. కానీ ఒక సంఘటనకు సంబంధించి వివరాలు పూర్తిగా తెలియకుండా మాట్లాడడం మంచిపద్దతి కాదు అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. స్పెసిఫిక్ గా ఒక ఇన్సిడెంట్ పై మాట్లాడని చెప్పింది. వీటిలో కొన్ని కేసులు త్వరలో కోర్టు కు వెళ్తాయని భావిస్తున్నానని చెప్పింది.
లోరియాల్ వారు అందిస్తున్న 'వీ వర్త్ ఇట్' అవార్డు గురించి మాట్లాడుతూ "మేము వీ వర్త్ ఇట్ అవార్డు ను స్టార్ట్ చేసినప్పుడు నేనే పోస్టర్ గర్ల్ అయ్యాను. మేము మహిళల గురిచి మాట్లాడుతున్నాము.. మహిళల అభ్యున్నతి గురించి పాటుపడుతున్న వారిని ఈ ప్లాట్ ఫామ్ కు తీసుకొచ్చి వారిని ఎక్కువమంది గుర్తించేలా చేయదలుచుకున్నాము" అని చెప్పింది. ఇక మహిళలు వైపు నిలబడడం.. వారు తమ సమస్యల గురించి ధైర్యంగా మాట్లాడేందుకు సహకారం అందించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. సోషల్ మీడియా మహిళల బాధను వింటోందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
తను మొదటి నుండి మహిళల తరపున మాట్లాడుతూనే ఉన్నానని.. మొదటి సారి ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న రోజు నుండి ఆ పని చేస్తున్నానని తెలిపింది. ఏదేమైనా #మీటూ కాంపెయిన్ జోరు చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. సంబంధం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఈ కాంపెయిన్ పై స్పందించాల్సిన పరిస్థితి సెలెబ్రిటీలకు ఏర్పడింది