Begin typing your search above and press return to search.
వార్నీ.. ఐశ్వర్యారాయ్ అలా పట్టుబట్టిందా?
By: Tupaki Desk | 4 Oct 2016 11:30 AM GMTబాలీవుడ్ ఎంత అడ్వాన్స్ అయినా కానివ్వండి. ఒక హీరోయిన్ కు పెళ్లయింది అంటే దర్శక నిర్మాతల దృష్టికోణం మారిపోతుంది. అంతకుముందు హీరోయిన్లు ఎంతగా రెచ్చిపోయి ఉన్నా సరే.. పెళ్లి తర్వాత మాత్రం కొంచెం పద్ధతైన క్యారెక్టర్లే ఇస్తారు. అందాల ప్రదర్శన కోసం పట్టుబట్టరు. ఇంటిమేట్ సీన్లు లేకుండా చూసుకుంటారు. కానీ ఐశ్వర్యారాయ్ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా టీజర్.. ట్రైలర్లలో ఆమె రెచ్చిపోయిన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఐశ్వర్య బ్యాగ్రౌండ్ ప్రకారం చూస్తే.. ఆ ఇంటిమేట్ సీన్లు షాకిచ్చేవే. ఐతే చిత్రమైన విషయం ఏంటంటే.. ముందు స్క్రిప్టు రాసినపుడు ఇలాంటి సీన్లు.. పాటలేవీ సినిమాలో లేవట.
స్క్రిప్టు చదివాక ఐశ్వర్యే స్వయంగా వీటి కోసం పట్టుబట్టిందట. స్క్రిప్టు చదివినపుడు చప్పగా అనిపించడంతో తన క్యారెక్టర్లో ఇంటెన్సిటీ పెంచాలని ఆమే కోరిందట. తన పాత్రను మామూలుగా చూపిస్తే సినిమా వర్కవుట్ కాదని.. కాబట్టి కొంచెం బోల్డ్ గా ఈ పాత్రను తీర్చిదిద్దాల్సిన అవసరముందని.. తన విషయంలో సందేహాలేమీ పెట్టుకోకుండా పాత్ర డిమాండ్ మేరకు తీర్చిదిద్దాలని ఐశ్వర్యే చెప్పిందట. దీంతో కరణ్ జోహార్ బాగా మసాలా అద్ది ఈ పాత్రను తయారు చేశాడట. ఆయన అంచనాలకు తగ్గట్లే రణబీర్.. ఐశ్వర్య మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండటంతో ఈ సినిమాపై మంచి హైప్ వచ్చింది. టీజర్.. ట్రైలర్లలోనే ఓ రేంజిలో రెచ్చిపోయిన ఐష్.. సినిమాలో ఇంకెలా కనిపిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబరు 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/