Begin typing your search above and press return to search.

సంపాదనలో భర్తను మించిన ఐశ్వర్యరాయ్..ఆస్తి ఎంతంటే?

By:  Tupaki Desk   |   22 May 2020 12:30 PM GMT
సంపాదనలో భర్తను మించిన ఐశ్వర్యరాయ్..ఆస్తి ఎంతంటే?
X
విశ్వసుందరిగా కిరీటం గెలిచి బాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ అంటే ఇప్పటికీ పిచ్చ క్రేజ్ జనాల్లో ఉంది. దక్షిణాదిన కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఐశ్వర్య చివరకు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం లాక్ డౌన్ లో కుటుంబంతో సరదాగా గడుపుతోంది. నటిగానే కాదు.. తల్లిగా.. భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

ఐశ్వర్యరాయ్ సంపాదన ఆమె భర్త అభిషేక్ బచ్చన్ ను మించి ఉందని బాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఐశ్వర్య వయసు 46 ఏళ్లు. అయినా అందంగా కనపడుతూ కుర్రకారు మతి పోగొడుతుంటుంది. తనకంటే చిన్నవాడైన అభిషేక్ ను పెళ్లి చేసుకుంది.

ఐశ్వర్యరాయ్ 1997లో సినిమా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచే డబ్బును చాలా తెలివిగా సేవింగ్స్ చేసింది. స్టార్ హీరోయిన్ గా మారాక వచ్చిన డబ్బును ఆస్తులుగా మలిచింది. ఇప్పటికీ ఆమెకు 260 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఆస్తులున్నాయట.. దుబాయ్ సానిటరీ ఫాల్స్ లో ఐశ్వర్యకు విలాసవంతమైన విల్లా ఉంది. ఇక ఐశ్వర్య ఆభరణాల విలువ కోటికి పైగానే ఉంటుందట.. ఇయర్ రింగ్స్ విలువ 70 లక్షలు ఉంటాయట..

ఇక ఆమె భర్త, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సొంత ఆస్తుల విలువ చాలా తక్కువ. భార్య సంపాదనతో పోల్చితే తీసికట్టేనట.. తండ్రి అమితాబ్ ఆస్తులు కలుపుకుంటే అభిషేక్ ఆస్తులు 200 కోట్లు అట.. ఇందులో అభిషేక్ వాటా తక్కువ. ఇక మొత్తం ఫ్యామిలీ ఆస్తుల విలువ 500 కోట్లుగా ఉంటుందట.. ఇప్పటికీ ఐశ్వర్య వివిధ బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతూ సంపాదిస్తోందట..