Begin typing your search above and press return to search.

కేన్స్ లో మరోసారి మెరుపులు

By:  Tupaki Desk   |   14 May 2018 4:50 AM GMT
కేన్స్ లో మరోసారి మెరుపులు
X

కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం రావడమంటేనే హీరోయిన్లకు గొప్ప గౌరవం వచ్చినట్టు. రెడ్ కార్పెట్ పై ఎలాంటి లుక్ లో అడుగు పెడతారా అని ఫ్యాషన్ ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. అలాంటి ఈ ఫెస్టివల్లో తన సొగసుల మెరుపులతో అందరినీ మైమరిపించేసింది అందాల సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్.

ఈ కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ పై ఐష్ నడవడం ఇది రెండోసారి. ముందు సాగరకన్య స్టయిల్ లో మెరిసిన తరవాత కొద్ది సేపట్లోనే కొత్త లుక్ తో కనిపించింది. దీంతో ఫ్యాషన్ ప్రియుల కళ్లన్నీ ఆమెపైనే ఫోకస్ అయ్యాయి. కౌచర్ స్టయిల్ లో వైట్ కలర్ గౌన్ లో దేవకన్యలా నడుచుకుంటూ వచ్చిన ఆమెను చూసి అభిమానులంతా ఫిదా అయిపోయారు. కేన్స్ లో డిఫరెంట్ హెయిర్ స్టయిల్ తో ఐష్ ఈసారి ఓ కొత్త లుక్ తో వచ్చింది. క్లీవేజ్ సొగసులు కూడా కలగలపి కవ్వించింది.

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు బాలీవుడ్ నుంచి మరికొందరు సుందరీమణులు కూడా వచ్చారు. కానీ 44 ఏళ్ల ఈ మాజీ ప్రపంచ సుందరి మాత్రం సరికొత్త స్టయిల్ తో రెండుసార్లు రెడ్ కార్పెట్ పై నడిచి అందరి ఇంప్రెస్ చేసింది. వయసు పెరిగినా సొగసు తరగని ఐష్ కేన్స్ కు కొత్త కళ తెచ్చిందంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

మరిన్ని ఫొటోస్ కోసం క్లిక్ చేయండి