Begin typing your search above and press return to search.
పాపం ఐష్.. కన్నీళ్లు పెట్టేసుకుందే
By: Tupaki Desk | 21 Nov 2017 6:53 AM GMTఅందాల రాణి ఐశ్వర్య రాయ్ ఒక పబ్లిక్ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కన్నీళ్లకు కారణం ఫొటోగ్రాఫర్లే. తన తండ్రి స్మారకార్థం తలపెట్టిన ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యను ఫొటోగ్రాఫర్లు అదే పనిగా ఫొటోలు తీస్తుండటంతో ఆమె అసహనానికి గురైంది. ఎంత చెప్పినా ఫొటోగ్రాఫర్లు వినకుండా ఒక ఫ్యాషన్ ఈవెంట్ తరహాలో ఫొటోలు తీస్తూనే ఉండటంతో ఐష్ ఫ్రస్టేట్ అయిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది.
ఇటీవలే ఐష్ కూతురు ఆరాధ్య ఆరో పుట్టిన రోజు వేడుకలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దివంగతుడైన తన తండ్రి స్మారకార్థం 100 మంది చిన్నారులకు గ్రహణ మొర్రి శస్త్రచికిత్సలు చేయించాలని ఐష్ నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఓ ఆసుపత్రి సౌజన్యంతో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసింది ఐష్. ఈ కార్యక్రమానికి మీడియా వాళ్లు కూడా వచ్చారు.
పెద్ద ఎత్తున ఫొటోగ్రాఫర్లు విచ్చేసి.. ఐష్ ను అదే పనిగా ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. ఇక ఫొటోలు ఆపమని విన్నా వాళ్లు వినలేదు. దీంతో ఐశ్వర్యకు ఆగ్రహం - ఆవేదన తన్నుకొచ్చాయి. ఇది ఫ్యాషన్ ఈవెంట్ కాదని.. ఒక మంచి కార్యక్రమం అని.. పని ఎలా చేయాలో మీకు తెలియదా అని అసహనం వ్యక్తం చేసింది ఐష్. ఆ సమయంలో తన తండ్రిని కూడా తలుచుకోవడం వల్లో ఏమో ఆమెకు కన్నీళ్లు వచ్చేశాయి.