Begin typing your search above and press return to search.

కార్పెట్ బ్యాచ్ లో దీపిక కూడా...

By:  Tupaki Desk   |   5 May 2017 11:53 AM GMT
కార్పెట్ బ్యాచ్ లో దీపిక కూడా...
X
విన్ డీసెల్ "XXX: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్" సినిమాతో ఈ ఏడాది హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది బాలీవుడ్ భామ దీపికా పదుకొనే. ఆ ఊపుతో ఇదే ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు సైతం హాజరు కానుంది.

ఈనెల 17 నుంచి 28 వరకు జరిగే 70వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మనదేశం నుంచి ముగ్గురు సుందరీమణులు హాజరు కానున్నారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ - సోనమ్ కపూర్ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నారు. ఇప్పుడు మరో సెక్సిణి దీపిక ఈ బ్యాచ్ లో జాయినవుతోంది.

హాలీవుడ్ సెలబ్రిటీలు జూలియన్ మోర్ - ఎవా లాంగోరియాలతో కలిసి దీపిక - సోనం - ఐశ్వర్యారాయ్ ఈ ఫిలి ఫెస్టివల్ లో పాల్గొననున్నారు. వీరందరూ ఒకే కాస్మెటిక్ బ్రాండ్ ప్రచారకర్తలు కావడమే ఇక్కడ విశేషం. ''కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు అఫీషియల్ మేకప్ పార్ట్ నర్ గా కొనసాగుతున్న మాకు ఇది చాలా ప్రత్యేకమైన సంవత్సరం. ఈ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా - సోనం - ఐశ్వర్యారాయ్ లను మా ప్రతినిధులుగా వ్యవహరిస్తారంటూ'' ఆ సంస్థ ప్రకటించింది.

తాజాగా దీపిక చారిత్రాత్మక చిత్రం రాణి పద్మావతి షూటింగ్ లో బిజీగా ఉంది. ఇందులో ఈమె టైటిల్ రోల్ పోషిస్తోంది. కేన్స్ కు వెళుతున్న సందర్భంగా కాస్మెటిక్ కంపెనీ వాళ్లు దీపికతో ప్రత్యేకంగా ఇటీవల యాడ్ క్యాంపెయిన్ చేశారు. ఈ చిత్రాలు చూసిన వారందరి మతులు పోగొడుతున్నాయంటూ అతిశయోక్తి ఏమీ కాదు. మొన్ననే మెట్ గలా అవార్డుల మేళాలో బ్రా-లెస్ మరియు బ్యాక్-లెస్ లుక్కుతో తళుక్కుమన్న దీపిక.. ఇప్పుడు కేన్స్ లో ఎన్ని వగలు పోతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/