Begin typing your search above and press return to search.
ఐష్, కేట్, సోనమ్.. మల్టీ స్టారర్ రెడీ
By: Tupaki Desk | 6 Jan 2016 1:30 PM GMTఅందాల తారలు ఐశ్వర్యా రాయ్ - కత్రినా కైఫ్ - సోనమ్ కపూర్ లు ఒకే స్క్రీన్ పై సందడి చేస్తే! ఒకే స్క్రీన్ లో కనిపిస్తే ! ఆ ఊహకే అదుర్స్ అనిపిస్తుంది కదూ. ఇప్పటివరకూ ఇలాంటి ప్రయోగం ఎవరూ చేయలేదు కానీ.. ఇప్పుడు మాత్రం ఇది సాధ్యమవుతోంది. అయితే.. ఇది సినిమా కోసం ఓ యాడ్ ప్రమోషన్ కోసం ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఒకే స్క్రీన్ ని పంచుకోబోతున్నారు.
ఇంటర్నేషనల్ స్కిన్ కేర్ బ్రాండ్ అయిన లోరియల్ కు ఐశ్వర్యారాయ్ బ్రాండ్ అంబాసిడర్. చాలా సంవత్సరాలుగా ఈ ప్రోడక్ట్స్ కి ఐష్ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఇదే సంస్థ కొత్త ప్రోడక్ట్ ను లాంఛ్ చేయనుంది. అడ్వాన్స్ డ్ హెయిర్ కేర్ అంటూ.. కేశ సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను విడుదల చేయనుంది. వీటికోసం ఐష్ తో మాత్రమే కాకుండా.. కత్రినా - సోనమ్ వంటి టాప్ స్టార్స్ ని కూడా తీసుకుని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇలా ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు అందాల తారలు సందడి చేయబోతున్నారు. ఈ కేంపెయిన్ కి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిపోయింది. ' లోరియల్ ప్రొడక్ట్స్ కోసం జరిపిన షూటింగ్ సూపర్బ్ గా వచ్చింది. మా ముగ్గురిని చాలా అందంగా చూపించారు. వేరు వేరు వ్యక్తిత్వాలు ఉన్న మమ్మల్ని ఒకే ఫ్రేమ్ లోకి తెచ్చింది ఈ కంపెనీ' అంటూ సోనమ్ కపూర్ స్టేట్ మెంట్ ఇఛ్చింది.
'ఈ యాడ్స్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతాయని నేను చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నా' అంటూ ఐశ్వర్యా రాయ్ ట్వీట్ చేయగా... 'ఈ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లోరియల్ పారిస్ అద్భుతమైన ప్రోడక్టులతో ప్రజల మన్నన పొందుతోంది' అంటూ కేట్ చెప్పుకొచ్చింది. ఏమైనా మరికొన్ని రోజుల్లో ఈ ముగ్గురు తారలు కలిసి చేయబోతున్న సందడిని.. స్క్రీన్ లపై చూసేయచ్చు.