Begin typing your search above and press return to search.
ఐష్ ను అభిమానులు అలా ఒప్పుకుంటారా?
By: Tupaki Desk | 16 May 2019 10:27 AM GMTదాదాపు రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరిస్తున్న ఐశ్వర్య రాయ్ రీ ఎంట్రీలో కూడా దుమ్ము రేపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బిడ్డ పుట్టడంతో సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య రాయ్ గతంతో పోల్చితే కాస్త తక్కువ సినిమాలు చేస్తోంది. మంచి కథ, మంచి పాత్ర అయితేనే నటించేందుకు ఆసక్తి చూపుతోంది. తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో ఒక చిత్రంను చేసేందుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. అది మాత్రమే కాకుండా కెరీర్ లోనే మొదటి సారి ఐశ్వర్య రాయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అందులో చేయబోతుందట.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో ఐశ్వర్య నటించేందుకు ఓకే చెప్పిందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ చిత్రంలో ఐశ్వర్య రాయ్ విలన్ గా కనిపించబోతుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మణిరత్నం పలు చిత్రాలతో ఐశ్వర్య రాయ్ కి మంచి బ్రేక్ ఇచ్చాడు. అందుకే ఎప్పుడు ఆయన కోరినా కూడా ఐష్ నటించేందుకు ఓకే చెబుతుంది. అలాగే ఇప్పుడు కూడా పొనినయన్ సెల్వన్ చిత్రంలో విలన్ గా నటించేందుకు ఓకే చెప్పి ఉంటుందని భావించవచ్చు. అయితే ఐష్ ను విలన్ గా ఆమె అభిమానులు ఒప్పుకుంటారా అనేది అనుమానమే.
ఒక వైపు పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని నిర్మిస్తామంటూ ముందుకు వచ్చిన లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తమ వల్ల కాదని ప్రాజెక్ట్ ను వదిలేసి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాని మణిరత్నం మాత్రం తన పని తాను చేసుకు పోతున్నాడట. లైకా వారు కాకుంటే మరో నిర్మాణ సంస్థ అయినా ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వస్తుందనే నమ్మకం ఆయన కలిగి ఉన్నాడు. 10వ శతాబ్దంకు చెందిన రియల్ కథతో ఈ చిత్రంను రూపొందించబోతున్నారు. చాలా ఏళ్లుగా ఈ చిత్రంను తీయాలని పలువురు దర్శకులు కోరుకున్నారు. కాని అది వారికి సాధ్యం కాలేదు. ఇప్పుడు మణిరత్నం మాత్రం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మణిరత్నంకు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు.