Begin typing your search above and press return to search.

ఐష్ ని అప్సెట్ చేసిన ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   12 Feb 2016 2:58 PM IST
ఐష్ ని అప్సెట్ చేసిన ఫ్యాన్స్
X
తమ అభిమాన సినీ నటులు నిజంగా కనిపిస్తే.. ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక హఠాత్తుగా హీరోయిన్లు కనిపిస్తే.. వెంటబడిపోతారు. అదే అందాల తార ఐశ్వర్యారాయ్ కనిపిస్తే.. మరి జనం ఎలా ఎగబడిపోతారో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఓ సంఘటన కారణంగా ఐశ్వర్య బాగా విసుగు చెందింది.

రీసెంట్ గా ఓ ఫోటో షూట్ కి హాజరై.. తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో.. బోలెడుమంది జనాల గుంపు ఐశ్వర్యారాయ్ ను చుట్టుముట్టేశారు. ఇలా ఫ్యాన్స్ దగ్గరకి రావడం ఈ మాజీ మిస్ వరల్డ్ కు కొత్తేం కాదు కానీ.. ఈసారి మాత్రం ఆమె బాగా చిన్నబుచ్చుకుంది. ఓ సమయంలో తన సహనం కూడా కోల్పోయి అరిచేసింది. దీనికి ఆమె దగ్గర చిన్నారి ఆరాధ్య ఉండడమే. సాధారణంగా అమ్మ ఐశ్వర్య ఎక్కుడుంటే.. కూతురు ఆరాధ్య కూడా అక్కడే ఉంటుంది. షూటింగ్ - ఫోటో షూట్.. ఇలా ఎక్కడికి వెళ్లినా తనతో పాటే తీసుకెళుతుంది. ఇప్పుడు ఆరాధ్యకు కొంచెం నలతగా ఉండడంతో అసలు వదిలిపెట్టడం లేదు.

ఇలాంటి సమయంలో ఫ్యాన్స్ హంగామా పెరిగిపోవడం.. ఐష్ కు అసహనం తెప్పించింది. చుట్టూ ఉన్న గుంపును చూసి భయపడ్డ ఆరాధ్య ఏడుపు లంకించుకోవడంతో.. అందరిపైనా కసురుకుంది ఐశ్వర్యారాయ్. అభిమాన తారలు కనిపిస్తే ఉత్సాహం చూపించచ్చు కానీ.. మరీ పసి పిల్లలు ఉన్నపుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా ఫ్యాన్స్.