Begin typing your search above and press return to search.
సెట్లో రచ్చ: ఐశ్వర్యారాయ్ విలనీ ఆ లెవల్లో
By: Tupaki Desk | 23 July 2021 5:35 AM GMTస్టార్ డైరెక్టర్ మణిరత్నం ఇరువార్ (ఇద్దరు) చిత్రంతో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ని కథానాయికను చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మణిరత్నం తెరకెక్కించిన పలు చిత్రాల్లో ఐశ్వర్యారాయ్ కథానాయికగా నటించారు. ఇప్పుడు కూడా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
వివాహం తర్వాత సెలక్టివ్ గా ఉంటున్న ఐష్ తన గురువు మణిరత్నం అడగ్గానే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఈ సినిమాకి అంగీకరించారు. పొన్నియిన్ సెల్వన్ లో భాగమని ఐశ్వర్య అధికారికంగా ధృవీకరించిన సంగతి విధితమే. ఇంతకుముందు ఓ షెడ్యూల్ లో ఐశ్వర్యారాయ్ పాల్గొన్నారు. కోవిడ్ -19 రెండవ వేవ్ వల్ల బ్రేక్ పడినా ఇటీవల తిరిగి చిత్రీకరణ ప్రారంభించగా.. ఐశ్వర్య తిరిగి సెట్స్ కి వచ్చారు. చిత్రీకరణ జరుగుతున్న పాండిచ్చేరికి ఐసూ వెళ్లారట. ఐశ్వర్య ఇటీవల పిఎస్ -1 పోస్టర్ ను షేర్ చేసి ``గోల్డెన్ ఎరా లైఫ్ మణిరత్నం .. పొన్నియిన్ సెల్వన్ పిఎస్ 1 కి వస్తుంది`` అన్న ఆసక్తికర వ్యాఖ్యను జోడించగా అది అభిమానుల్లో వైరల్ అయ్యింది. దీనర్థం గ్యాప్ తర్వాత మణిరత్నం ఈజ్ బ్యాక్! అన్నదే.
పొన్నియన్ సెల్వన్ ఊహించని విధంగా రెండు పార్ట్ లుగా తెరకెక్కుతోంది. భారీ కాన్వాస్ పై బాహుబలి తరహాలోనే ప్లాన్ చేసిన మణిరత్నం మేకింగ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీకి రావడం లేదని తెలిసింది. ఈ చిత్రంలో విక్రమ్- కార్తీ- త్రిష కృష్ణన్- ప్రకాష్ రాజ్ సహా స్టార్ స్టడ్ తారాగణం నటిస్తున్నారు.
నవల స్ఫూర్తితో..!
ఈ చిత్రం కల్కి కృష్ణమూర్తి రచించిన 1995 నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా రూపొందుతోంది. ఇది ఒక హిస్టారికల్ డ్రామా ఆధారిత చిత్రం. ఐష్ ఇందులో విలన్ గా కనిపిస్తారన్నది పెద్ద ట్విస్ట్. అందుకే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నీయిన్ సెల్వన్ గత కొంతకాలంగా వైరల్ గా చర్చల్లోకొస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ మూవీ ఇది. భారీ తారాగణం టాప్ టెక్నీషియన్స్ ఈ మూవీకి పని చేస్తుండడంతో ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక ఈ మూవీలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ విలన్ పాత్రను పోషిస్తుండడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. ఆస్కార్ విజేత .. స్వరమాంత్రికుడు ఎఆర్ రెహమాన్ బాణీలు అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ -మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2022లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఇందులో విలక్షన నటుడు ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారు. అతను ఇంతకు ముందు 1997 లో `ఇరువర్ బ్యాక్`లో మణిరత్నంతో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. అందులో ఐశ్వర్యారాయ్ కథానాయికగా నటించింది. ఒక రాజకీయ నాయకుడిగా ప్రకాష్ రాజ్ నటించారు. ఇప్పుడు మరోసారి మణిరత్నం తో మరోసారి ఐష్- ప్రకాష్ రాజ్ జోడీ కట్టారు. ఇంతకుముందు ప్రకాష్ రాజ్ స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ లో ప్రకటించారు. ``పొన్నీఇన్సెల్వన్ .. మాస్టర్ తో ఒక ప్రయాణం .. 25 సంవత్సరాల క్రితం `ఇరువర్` నుండి ప్రారంభమైంది ... తెలియని ఆనందం ... కొత్త ఎత్తులను కనుగొంటాం. ఆనందం తో ఆశీస్సులతో..`` అంటూ తనదైన శైలిలో ప్రకాష్ రాజ్ పోయెటిక్ గా స్పందించారు.
ఈ చిత్రంలో కార్తీ- చియాన్ విక్రమ్- ఐశ్వర్య లక్ష్మి- మోహన్ బాబు- జయం రవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కోవిడ్ -19 మహమ్మారి లాక్ డౌన్ లో సుదీర్ఘ విరామం తర్వాత వారం క్రితమే ఈ చిత్రం షూట్ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ జరుగుతోంది. 2019 లో మొదటి షెడ్యూల్ థాయ్ లాండ్ లో పూర్తయింది. అక్కడ దాదాపు 90 రోజులు చిత్రీకరించారు. సెకండ్ వేవ్ అనంతరం పని వేగవంతమైందని సమాచారం.