Begin typing your search above and press return to search.
ఐష్ పై సల్మాన్ వేధింపులు తెరపైకి!
By: Tupaki Desk | 11 Oct 2018 7:33 AM GMTమీటూ ఇండియా- 2018 ప్రకంపనాలు కొనసాగుతున్నాయ్. గత ఏడాది ఇదే సీజన్ లో హాలీవుడ్ లో మీటూ ప్రకంపనాలు తీవ్రంగా చర్చకొచ్చాయి. ఈ ఏడాది ఇండియాలో ఊహించని రీతిలో `మీటూ ఇండియా` ప్రకంపనాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు దర్శకులు - నటులపై కథానాయికలు - నటీమణులు తీవ్ర ఆరోపణలు గుప్పించి ఆధారాలు బయటపెడుతుండడంతో పోలీసులు ఉరుకులు పరుగుల మీద విచారణలకు రెడీ అవుతున్నారు. ఆ క్రమంలోనే పలు భారీ హిందీ చిత్రాలు ఇప్పటికే డిఫెన్స్ లో పడడం చర్చకొచ్చింది. పలువురు దర్శకులకు నిర్మాణ సంస్థలు రాంరాం పలికేస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుల్ని పలు కంపెనీలు దూరం పెట్టేసేందుకు రెడీ అవుతున్నాయి. హార్వే వీన్ స్టీన్ - కెవిన్ స్పేసీ వంటి ఉద్ధండుల్ని హాలీవుడ్ ఎలా పక్కన పెట్టేసిందో - ఇప్పుడు అదే తీరుగా ఇండియాలోనూ పలువురు స్టార్లకు చుక్కలు కనిపించే పరిస్థితి నెలకొంది. ఇది పలువురికి మింగుడుపడని వ్యవహారంలా మారింది. బిలియన్ డాలర్ బిజినెస్ ప్రపంచంలో ఎందరికో ఊస్టింగ్ కార్డులు రెడీ అవుతున్నాయి.
మొన్న నానా పటేకర్.. నిన్న `సూపర్ 30` దర్శకుడు వికాస్ బాల్.. నటుడు అలోక్ నాథ్ పేర్లు మీటూ ఉద్యమంలో బయటకు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పేరు మరోమారు ఈ ఉద్యమం పేరుతో బయటకు రావడం సంచలనమైంది. ప్రస్తుతం మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ప్రఖ్యాత `లోరియల్` ప్రచారకర్తగా ఫోటోషూట్ లో పాల్గొన్నారు. అయితే ఐష్ పబ్లిక్ వేదికపై మీటూ ఇండియా ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇదే అదనుగా బాలీవుడ్ మీడియా మరోసారి సల్మాన్ పేరును తెరపైకి తెచ్చింది. ఐష్ తన మాజీ ప్రేమికుడు సల్మాన్ పేరును ప్రస్థావించకుండా కేవలం మీటూ ఉద్యమాన్ని సపోర్టు చేస్తూ మహిళలంతా గొంతెత్తి తమకు జరిగే అన్యాయాల్ని చాటి చెప్పాలని వ్యాఖ్యానించారు. అయితే 2002లో ఐశ్వర్యారాయ్ ని సల్మాన్ వేధించారంటూ ఒకటే రచ్చ మొదలు పెట్టింది మీడియా. ఓ ప్రఖ్యాత మీడియా అయితే ఐష్ మీటూ వ్యాఖ్యలకు గత వివాదాన్ని జోడించి ప్రచారం చేస్తోంది. 2002లో ఐష్ ని సల్మాన్ వేధింపులకు గురి చేశాడు. తనని తిట్టాడు - కొట్టాడు.. గాయపరిచాడు. కానీ ఆ గాయాలు బయటకు కనిపించలేదని అప్పట్లో ఐష్ వ్యాఖ్యానించింది! అంటూ పాత గాయాన్ని మళ్లీ రేపే ప్రయత్నం చేసింది సదరు మీడియా. అయితే ఐష్ ప్రస్తుతం బచ్చన్ ల కోడలు. మ్యారీడ్ ఉమెన్ అన్న ఇంగితాన్నే మరువడం కాస్త ఇబ్బందికరమే. ఐష్ తనంతట తానుగా సల్మాన్ పేరును ప్రస్తుత సందర్భంలో బయటకు తేకపోయినా ఇప్పుడిలా మీడియాలో రచ్చ జరుగుతోంది. 1999లో భన్సాలీ తెరకెక్కించిన `హమ్ దిల్ దే చుకే సనమ్` టైమ్ లో సల్మాన్ - ఐశ్వర్యారాయ్ ప్రేమికులు. అప్పట్లో ప్రేమికుల మధ్య గొడవలు వచ్చిన మాట వాస్తవం. ఆ క్రమంలోనే ఎమోషనల్ గా ఆ ఇద్దరి మధ్యా బోలెడన్ని జరిగాయి. 2002 మార్చిలో ప్రేమకు బ్రేకప్ చెప్పారు. అదంతా గతం. కానీ దానిని తాజా వివాదానికి జోడించి రచ్చ చేయడం చర్చకొచ్చింది.