Begin typing your search above and press return to search.
ఆ ఫొటోతో ఐష్ ప్రూవ్ చేసింది
By: Tupaki Desk | 4 Jun 2018 4:33 AM GMTవయసు పెరిగినా తరగని సొగసు ఐశ్యర్యా రాయ్ బచ్చన్ సొంతం. రెండు దశాబ్దాల క్రితం ఏ సోగకళ్లతో ప్రేక్షకులందరినీ మత్తులో ముంచేసిందో ఇప్పటికీ అలాగే మాయ చేయగలదు. అది ఐష్ అందంలో ఉన్న మహత్తు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలు అయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది. వాటిల్లో గ్లామర్ రోల్స్ బోలెడున్నాయి.
కొన్నాళ్ల క్రితం ఐష్ మితిమీరి గ్లామర్ ఆరబోసి ఒకట్రెండు సినిమాల్లో నటించింది. ఇది ఐష్ అత్త.. జయబచ్చన్ కు అస్సలు నచ్చలేదని బాలీవుడ్ లో టాక్ వినిపించింది. దీనిపై ఐశ్వర్యతో పర్సనల్ గా మాట్లాడి ఆమెను హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో జయబచ్చన్ చాలా ఫీలయిందని.. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మాటల్లేవని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. కానీ ఈ మాటలన్నింటికీ ఐశ్వర్య తాజాగా ఒకే ఒక్క ఫొటోతో చెక్ చెప్పేసింది. అమితాబ్ - జయబాధురిల మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వాళ్లిద్దరితో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలను పంచుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘‘హ్యాపీ యానివర్సరీ పా అండ్ మా’’ అంటూ అత్తమామలను అమ్మానాన్నలుగా సంబోధిస్తూ వాళ్లను విషెస్ చెప్పి తమ మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో తెలిసేలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. ఐశ్వర్య తాజాగా హీరోయిన్ గా నటించిన ఫానీ ఖాన్ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.