Begin typing your search above and press return to search.
ముద్దుల రాణితో అందాల ఐష్
By: Tupaki Desk | 24 May 2017 3:52 PM GMTమాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ వయసు ప్రస్తుతం 40కి పైగానే అనే విషయం తెలిసిందే. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని రెండు దశాబ్దాలకు పైగా కాలం గడిచిపోయినా ఇంకా తరగని అందంతో మెరిసిపోతూ ఉంటుంది ఐష్.
తాజాగా 70వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం తొలిరోజున ఐశ్వర్య చూపించిన మెరుపులు.. ప్రతీ అభిమానిని కట్టిపడేయడం ఖాయం. నీలం రంగులోని సింగో గౌన్ లో ఐష్ ను చూసేందుకు జనాలకు రెండు కళ్లు చాలలేదు. రెడ్ కార్పెట్ పై ఐష్ ఒక్కతే సందడి చేసింది కానీ.. నిజానికి ఈమెతో పాటు కేన్స్ కు కూతురు ఆరాధ్య కూడా వెళ్లింది. అమ్మ ఐశ్వర్య బ్లూ కలర్ గౌన్ లో రెడీ అయితే.. చిన్నారి కూతురు ఆరాధ్య పింక్ కలర్ గౌన్ లో మెరిసింది. అమ్మా కూతుళ్లు ఇద్దరూ చూడముచ్చటగా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. విపరీతంగా షేరింగ్ అయిపోతోంది.
అందాల రాణితో చిన్నారి యువరాణి మాదిరిగా సిద్ధమైన ఆరాధ్య ఈ ఫోటోకు అసలు సిసలైన అట్రాక్షన్ అనడంలో సందేహాలు అక్కర్లేదు. అంతా బాగానే ఉంది కానీ.. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అందంగా కనిపిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు సుమీ!