Begin typing your search above and press return to search.

అత్తాకోడళ్ళ అందం మహిమ

By:  Tupaki Desk   |   10 Aug 2017 1:06 PM GMT
అత్తాకోడళ్ళ అందం మహిమ
X
వరల్డ్ బ్యూటీగా పేరుపొందిన ఐశ్వర్య రాయ్ పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఆమె వయసులో ఏ మాత్రం తేడా రాలేదనే చెప్పాలి. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా ఇరవై ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తూ అందరిని ఆకర్షిస్తుంది. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మడి సినిమాలను తగ్గించిన విష్యం తెలిసందే.

అయితే ఐశ్వర్య ఏ కార్యక్రమాలకు వెళ్లినా అందంగా కనిపిస్తుండడంతో కెమెరాలన్నీ ఆమె వైపే తిరుగుతున్నాయి. అయితే రీసెంట్ గా వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమానికి ఐశ్వర్య - అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నంద హాజరయ్యారు. దీంతో ఆ ఇద్దరు అవార్డుల ఫంక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. నవ్య నంద కూడా హీరోయిన్ గా త్వరలోనే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనుందట. అందుకోసం ఈ అమ్మడు ఓ ప్రత్యేకమైన ఫోటో షూట్ లను కూడా చేసింది.

ప్రస్తుతం వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో పాల్గొన్న నవ్య - ఐశ్వర్య ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఒకరిని మించి ఒకరు అందంతో మెరిసిపోతున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి. ఎందుకంటే వారి వేసుకొచ్చిన డ్రెస్ లు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి మరి కావాలంటే మిరే చూడండి ఓ సారి.