Begin typing your search above and press return to search.
డిమాండ్ ఉన్నప్పుడు కాకుండా.. ఫేడౌట్ అయ్యాక పెంచుతారా?
By: Tupaki Desk | 26 July 2021 11:30 PM GMTసినిమా ఇండస్ట్రీ రెండు మూడు సక్సెస్ లు పడితే పారితోషికం భారీగా పెంచేయడం చాలా కామన్ గా జరిగే విషయం. కొందరు ఒక్క సినిమాతోనే భారీగా పారితోషికంను పెంచేస్తూ ఉంటారు. డిమాండ్ ను బట్టి పారితోషికంను పెంచడంలో తప్పు లేదు అనేది కొందరి వాదన. హీరోయిన్స్ మొదటి సినిమాకు పాతిక లక్షలు అంతకు తక్కువ పారితోషికంను తీసుకుంటూ ఉంటారు. కాని ఒక్క సక్సెస్ పడి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తే వారు డిమాండ్ చేసే పారితోషికాలకు అడ్డు అదుపు ఉండదు అనే విమర్శలు ఉన్నాయి.
కోట్ల లో పారితోషికాలు తీసుకుంటున్న కొత్త హీరోయిన్స్ ఈమద్య కాలంలో చాలా మంది ఉన్నారు. మన తెలుగు సినిమా లో నటించి సూపర్ హిట్ దక్కించుకున్న ఒక అమ్మాయి మూడవ సినిమాకే ఏకంగా కోటిన్నర తీసుకుంటుంది. ఆమెకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో భారీగా వసూళ్లు చేస్తుంది. ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషికం విషయంలో తమిళ మీడియా గగ్గోలు పెడుతోంది. ఆమె పారితోషికం భారీగా పెంచేసింది అంటూ కథనాలు అల్లుతోంది. ఆమె కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ లు దక్కించుకోకున్నా కూడా ఆమె కు నటిగా మంచి డిమాండ్ ఉంది.
తమిళం మరియు తెలుగులో ఆమె వరుసగా సినిమాలకు కమిట్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో పది సినిమాల వరకు ఉన్నాయి. అంతగా డిమాండ్ ఉన్నప్పుడు పది లక్షలు పాతిక లక్షలు అంటూ తీసుకుంటే ఎలా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మూలాలు ఉన్న ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా తమిళంలో మొదట ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కూడా నటించింది.
ప్రస్తుతం ఈమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో కోటికి పైగా పారితోషికంను స్వయంగా నిర్మాతలు ఆఫర్ చేస్తున్నారు. భారీ పారితోషికం ఇచ్చినా కూడా కొన్ని సినిమాలకు ఈమె నిరాకరిస్తుంది. అందుకు కారణం ఈమెకు ఆ కథలు నచ్చక పోవడం అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ కోట్లు పారితోషికం తీసుకోవడంలో తప్పేం లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.