Begin typing your search above and press return to search.
ప్రేమ, పెళ్లి వార్తలపై రౌడీ హీరోయిన్ క్లారిటీ
By: Tupaki Desk | 17 May 2019 10:59 AM GMTవిజయ్ దేవరకొండ గురించి ఇప్పుడు ఏ చిన్న వార్త వచ్చినా కూడా అది పెద్ద వార్త అవుతుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి విజయ్ దేవరకొండ తన తర్వాత సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్య రాజేష్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆమెపై విజయ్ దేవరకొండ చాలా ఆసక్తిని కనబర్చుతున్నాడని, ఆమె కూడా రౌడీ స్టార్ పై ఆసక్తిగా ఉందంటూ పుకార్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హీరోయిన్ ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది.
ఐశ్వర్య ట్విట్టర్ లో ఈ విషయమై స్పందిస్తూ... నాకు ఒక ప్రేమ కథ ఉందని, నేను ప్రేమలో ఉన్నానని కొన్ని రోజులుగా పుకార్లు వింటున్నాను. ఆ వ్యక్తి ఎవరు అనే విషయం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత సీరియస్ గా ఇలాంటి పుకార్లను దయచేసి ఆపేయండి. ఒకవేళ నేను ప్రేమలో ఉంటే ఖచ్చితంగా నేనే ముందు చెప్పేస్తా. ప్రస్తుతం ఒంటరి జీవితంను చాలా సంతోషంగా గడుపుతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది.
ఐశ్వర్య రాజేష్ ప్రేమ విషయమై క్లారిటీ ఇవ్వడంతో ఇకపై అయినా ఇలాంటి పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ తో కలిసి విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. ఇంకా ఇద్దరు కలిసి నటించకుండానే పుకార్లు పుట్టుకు వచ్చాయి.. ముందు ముందు మరెన్ని వినాల్సి వస్తుందో అనే ఉద్దేశ్యంతో ఐశ్వర్య క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తన ట్వీట్‌లో విజయ్ దేవరకొండ పేరును ప్రస్థావించకుండానే పుకార్లకు ఐశ్వర్య రాజేష్ క్లారిటీ ఇచ్చేసింది.