Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కు నేచుర‌ల్ స్టార్ హీరోయిన్?

By:  Tupaki Desk   |   8 Nov 2022 8:31 AM GMT
బాలీవుడ్ కు నేచుర‌ల్ స్టార్ హీరోయిన్?
X
టాలీవుడ్‌, కోలీవుడ్ ల‌లో మంచి పేరుతెచ్చుకున్న హీరోయిన్ లు ఇప్ప‌డు బాలీవుడ్ బాట‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుక‌ని దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌డు ఈ బాట‌లో నేచుర‌ల్ స్టార్ నాని హీరోయిన్ న‌డ‌వ‌బోతోంది. విభిన్న‌మైన సినిమాల‌తో హీరోయిన్ గా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేష్‌.

'కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి' వంటి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన ఐశ్వ‌ర్యా రాజేష్ ఆ త‌రువాత మిస్ మ్యాచ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌', నేచుర‌ల్ స్టార్ నానితో 'ట‌క్ జ‌గ‌దీష్‌' వంటి సినిమాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన 'రిప‌బ్లిక్‌'మూవీలోనూ న‌టించినా ఆ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో ఐశ్వ‌ర్యా రాజేష్ తెలుగులో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాల్ని సొంతం చేసుకోలేక‌పోయింది.

అర్జున్ రాంపాల్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించి న‌టించిన 'డాడీ' సినిమాతో బాలీవుడ్ లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది. 2017లో విడుద‌లైన ఈ మూవీ ఐశ్వ‌ర్యా రాజేష్ కి పెద్ద‌గా గుర్తింపుని తెచ్చిపెట్ట‌లేక‌పోయింది.

మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు మ‌రోసారి బాలీవుడ్ లో త‌న స‌త్తా చాటాల‌నే ప్ర‌య‌త్నాల్లో వుంది ఐశ్వ‌ర్యా రాజేష్. ప్ర‌స్తుతం డ‌జ‌నుకు పైగా సినిమాలున్నాయి. ఇందులో 'డ్రైవ‌ర్ జ‌మున‌' పేరుతో రూపొందిన యాక్ష‌న్ డ్రామా న‌వంబ‌ర్ 11న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఇదిలా వుంటే మ‌రోసారి బాలీవుడ్ లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి రెడీ అవుతోంది ఐశ్వ‌ర్యా రాజేష్‌. ఎండేమోల్ షైన్ ఇండియా, న‌ట్మెగ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో 'మాణిక్' అనే మూవీని నిర్మిస్తున్నాయి.

ఐవ్వ‌ర్యా రాజేష్ తో పాటు ఈ మూవీలో సంయుక్త ష‌ణ్ముగ‌నాథ‌న్‌, వివేక్ ప్ర‌స‌న్న‌, సాయ్ జ‌న‌ని, స్వ‌ర కాంబ్లీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళంతో పాటు హిందీలోనూ ఈ మూవీని ద్వి భాషా చిత్రంగా నిర్మిస్తున్నారు. సామ్రాట్ చ‌క్ర‌వ‌ర్తి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీతో అయినా ఐశ్వ‌ర్యా రాజేష్ బాలీవుడ్ లో మ‌రిన్ని అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.