Begin typing your search above and press return to search.
మోహన్ బాబు స్కూల్లో చదుకున్న హీరోయిన్ ఆమెనా?
By: Tupaki Desk | 10 Oct 2021 2:30 AM GMTమంచు మోహన్ బాబు ఫ్యామిలీ సామాజిక కార్యక్రమాల్లో ముందుటుంది అన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు తనయులు విష్ణు..మనోజ్..కుమార్తె లక్ష్మి సైతం సామాజిక సేవల్లో పాలు పంచుకుంటారు. మోహన్ బాబు పేరిట కొన్ని ఫౌండేషన్లు స్థాపించి వాటి ద్వారా పేదలకు చదువు..నిత్యావసరాలు వంటివి అందజేస్తున్నారు. ఇక తిరుపతిలోని మెహన్ బాబు కి చెందిన శ్రీవిద్యానికేత న్ ఉన్నత పాఠశాల్ని కూడా స్థాపించి ఎంతో మంది పేదలకు విద్యను అవసరం అయిన వారికి ఉచితంగానే విద్యను అందిస్తున్నారు. ఈ స్కూల్ కి తిరుపతిలో మంచి పేరుంది. ఇదే స్కూల్ నుంచి ఎంతో మంది విద్యర్ధులు ఉన్నత రంగాలలో స్థిరపడ్డారు.
అయితే ఇటీవలే తన స్కూల్ నుంచి ఓ అమ్మాయి ఏకంగా పెద్ద హీరోయిన్ గా నే ఎదిగిందని మోహన్ బాబు ఓ షోలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్ ఎవరు? అని ప్రశ్నించగా మోహన్ బాబు పేరు గుర్తు లేదని అనేసారు. ఈ నేపథ్యంలో ఆ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అనే టాక్ వినిపిస్తోంది. ఐశ్వర్య సీనియర్ నటి శ్రీలక్ష్మి మేనకోడలు. ఐశ్వర్య తండ్రి చనిపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఆ సమయంలో ఐశ్యర్యకు ఉచితంగా శ్రీవిద్యానికేతన్ లో చదువుకునే వెసులు బాటు ఆ ఫ్యామిలీ కల్పించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ఐశ్వర్య కేవలం ఎంతో కాలా చదవలేదు. ఆ తర్వాత చెన్నైకి వెళ్లిపోయి అక్కడ కపాఠశాల..కళాశాల చదువుల్ని పూర్తిచేసింది. ఆమె బికాం పూర్తి చేసింది.
ఆ తర్వాత సినిమా రంగంలో స్థిరపడింది. అయితే ఆమె `రాంబంటు` సినిమాతోనే చైల్డ్ అర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయం అయింది. ఇక టాలీవుడ్ ఐశ్వర్య రాజేశ్ సెకెండ్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కె.ఎస్ రామారావు నిర్మించిన `కౌసల్య కృష్ణమూర్తి` సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత `మిస్ మ్యాచ్`..`వరల్డ్ ఫేమస్ లవర్`..`టక్ జగదీష్`..`రిపబ్లిక్` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగు..తమిళ్ లో రీమేక్ అవుతోన్న `ది గ్రేట్ ఇండియన్ కిచెన్` లో నటిస్తోంది.