Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ కూతురు.. స్టార్‌ హీరో మూవీ

By:  Tupaki Desk   |   13 March 2022 12:30 AM GMT
సూపర్ స్టార్‌ కూతురు.. స్టార్‌ హీరో మూవీ
X
తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఇటీవలే ధనుష్ కి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరి విడాకుల గురించి అధికారికంగా ప్రకటన వచ్చింది. విడాకుల సమయంలో మీడియాలో పలు రకాల పుకార్లు షికారు చేశాయి. ధనుష్ వ్యవహారం కారణంగానే ఐశ్వర్య అతడి నుంచి విడిపోయేందుకు సిద్ధమైంది అంటూ తమిళ మీడియాలో ఒక వర్గం వారు ప్రచారం చేయడం జరిగింది.

మరోవైపు ధనుష్ యొక్క ప్రవర్తన గురించి కాకుండా ఐశ్వర్య వ్యవహారం కారణంగా వారిద్దరి విడిపోయే పరిస్థితి వచ్చింది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇద్దరు కూడా వారి వారి పనుల్లో బిజీ అయి విడాకుల విషయాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ విషయానికి వస్తే ఆ మధ్య ఒక సినిమా షూటింగ్ లో ఉన్న సందర్భంగా కరోనా ఎఫెక్ట్ అయింది.

కరోనా తో ఆమె కొన్ని రోజుల పాటు ఆస్పత్రికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆరోగ్యం బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఆమె అనారోగ్యం బారిన పడ్డట్టు గా ప్రకటించి హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యింది. హాస్పిటల్లో ఉన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఐశ్వర్య రజినీకాంత్ కి ఏమైంది అంటూ అభిమానులు మరియు తమిళ సినీ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు.

రెండవ సారి హాస్పిటల్ కి వెళ్ళిన సమయంలో ఐశ్వర్య కొన్ని రోజుల్లోనే తిరిగి వచ్చేసింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన ఐశ్వర్య తాను సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక సినిమా రూపొందుతోంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సమయంలోనే ఐశ్వర్య రజనీకాంత్ తమిళ హీరో శింబు తో ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తుందని వార్తలు వచ్చాయి వస్తున్నాయి. తమిళ మీడియాలో ప్రముఖంగా ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తి గా ఆమె వైపు చూస్తున్నారు. గతంలో శింబు మరియు ఐశ్వర్య రజినీకాంత్ గురించి మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.

ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా అది కూడా ఐశ్వర్య దర్శకత్వంలో శింబు హీరోగా సినిమా అంటూ తమిళ మీడియా వారు గుసగుసలాడుకుంటున్నారు. శింబు తాజాగా మానాడు సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్నాడు.

కనుక ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో అతనికి మరో మంచి సక్సెస్ దక్కతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. వీరిద్దరి సినిమాకు సంబంధించిన విషయం అధికారికంగా ప్రకటించే వరకు ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.