Begin typing your search above and press return to search.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నాక అనారోగ్యం బారిన ఐశ్వర్య

By:  Tupaki Desk   |   2 Feb 2022 5:33 AM GMT
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాక అనారోగ్యం బారిన ఐశ్వర్య
X
ఇటీవలకాలంలో అనూహ్యంగా వార్తల్లోకి వచ్చిన ఐశ్వర్య రజనీకాంత్ తాజాగా మరోసారి వార్తలకు ఎక్కారు. వ్యక్తిగత సమస్యల కారణంగా స్టార్ కఫుల్ గా ఉన్న వీరిద్దరూ ఏకాభిప్రాయంతోవిడిపోవాలని నిర్ణయించుకోవటం తెలిసిందే. తమ విడాకుల వ్యవహరాన్ని వెల్లడించిన వారు అందరికి షాకిచ్చారు.

వీరి విడాకుల విషయంలో వారి అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తాను అనారోగ్యానికి గురై.. ఆసుపత్రిలో చేరిన వైనాన్ని తెలియజేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోను పోస్టు చేశారు.

అందులో ఆమె ఆసుపత్రి బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను పోస్టు చేశారు. సెలైన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతంఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చిందని.. హాస్పిటల్ లో ఆడ్మిట్ అయ్యానని పేర్కొన్నారు. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండాలని.. 2022 తన కోసం ఇంకేం తెస్తుందో చూస్తానని తన ఇన్ స్టా ఖాతాలో పేర్కొన్నారు.

ఐశ్వర్య పోస్టు నేపథ్యంలో ఆమె అభిమానులంతా త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. అందుకుసంబంధించిన మెసేజ్ లను పెడుతున్నారు. విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో పోస్టు పెట్టని ఐశ్వర్య వారం క్రితమే ఒక ఫోటోను షేర్ చేసుకున్నారు. అంతా బాగుందని భావిస్తున్న వేళలో ఆమె ఆస్వస్థతకు గురైన విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఆమె అభిమానులు మాత్రం ఇప్పటికి.. విడిపోయిన వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని అనుకోవటం గమనార్హం.