Begin typing your search above and press return to search.

ఐతే.. ఈ బూతులేంటి బాసూ??

By:  Tupaki Desk   |   10 March 2018 4:29 AM GMT
ఐతే.. ఈ బూతులేంటి బాసూ??
X
2003లో వచ్చిన ఐతే సినిమా కలెక్షన్స్ ఎంత రాబట్టిందో గాని అవార్డ్స్ పరంగా సినిమా మంచి గుర్తింపు అందుకుంది. ఎవరు ఊహించని విధంగా నేషనల్ అవార్డ్ దక్కడంతో సినిమా కథ ఇతర భాషల్లో మంచి రేట్ కు అమ్ముడు పోయింది. ఆ విధంగా నిర్మాత గుణ్ణం గంగరాజు గారికి కొంచెం లాభమే అని చెప్పాలి. అయితే సైలెంట్ గా క్రైమ్ హైజాకింగ్ తరహాలో సాగిపోయే ఆ ఐతే తరహాలోనే మరో సినిమా రావడానికి సిద్ధమవుతోంది.

ఈ కథలో కూడా నలుగురు స్నేహితులు ఒక అమ్మాయి ఉన్నట్లు తెలుస్తోంది. పాత ఐతే లానే కొత్తగా వస్తోన్న ఐతే 2.0 కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫెరెంట్ గా ఉంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో హ్యాకింగ్ చేయడం వంటి అంశాల చుట్టూ కథ నడుస్తుందని అర్ధమవుతోంది. అయితే ఈ ఐతే 2.0 తెరకెక్కించిన విధానం మాత్రం కొంచెం తేడా కొడుతోంది. అర్జున్ రెడ్డి డైలాగులు అలాగే ఇంగ్లీష్ బూతులు గట్టిగానే వాడినట్లు తెలుస్తోంది.

నార్త్ సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్ సేన్ తప్పితే సినిమాలో అందరు దాదాపు కొత్త వారే. ట్రైలర్ స్పీడ్ చూస్తుంటే సినిమాను ఏ తరహాలో తీశారో అర్ధమవుతోంది. మరి ఈ సరికొత్త థ్రిల్లర్ కథ అవార్డులను గెలుస్తుందా కలెక్షన్స్ ని గెలుస్తుందా అనే విషయం రిలీజ్ తరువాత తెలుస్తుంది. రాజ్ మదిరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను హేమంత్ - విజయ్ సంయుక్తంగా నిర్మించారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి