Begin typing your search above and press return to search.

శ్రీహరి బతికుంటే ఆ పాత్రకోసం బతిమలాడే వాడిని!

By:  Tupaki Desk   |   1 July 2019 8:53 AM GMT
శ్రీహరి బతికుంటే ఆ పాత్రకోసం బతిమలాడే వాడిని!
X
రియల్‌ స్టార్‌ శ్రీహరి చిన్న కొడుకు మేఘాంశ్‌ హీరోగా రూపొందిన 'రాజ్‌ దూత్‌' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. నక్షత్ర మరియు ప్రియాంక వర్మలు హీరోయిన్స్‌ గా నటించిన ఈ చిత్రంను త్వరలో విడుదల చేయబోతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించారు. ఈ వేడుకలో స్వర్గీయ శ్రీహరి కుటుంబ సభ్యులతో పాటు దర్శకులు బాబీ.. అజయ్‌ భూపతి.. రవి కుమార్‌ చౌదరి ఇంకా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్‌ ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్‌ భూపతి స్పీచ్‌ అందరిని ఆకట్టుకుంది.

అజయ్‌ భూపతి మాట్లాడుతూ.. మా జనరేషన్‌ దర్శకులం ఒక మంచి నటుడిని మిస్‌ అయ్యాం. ఆయన బతికి ఉండి ఉంటే నేను తీసిన ఆర్‌ ఎక్స్‌ 100 చిత్రంలోని డాడీ పాత్రకు బతిమిలాడైనా ఒప్పించేవాడిని. ఆయన లోటు తీర్చలేనిది అన్నాడు. ఇక రాజ్‌ దూత్‌ సినిమా టీజర్‌ చూశాను. హీరో చాలా మాసివ్‌ గా ఉన్నాడు. ఆర్‌ ఎక్స్‌ 100 తరహాలోనే రాజ్‌ దూత్‌ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ.. శ్రీహరి గారు మరియు శాంతి గార్లు నాకు వారి పెళ్లి కాకముందు నుండే పరిచయం. వారిద్దరి లవ్‌ స్టోరీ కూడా నాకు తెలుసు. శ్రీహరి అన్నయ్య డేట్లు నేనే చూసేవాడిని. డబ్బు గురించి ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. ఎంతో మంది సాయం చేసిన మంచి వ్యక్తి ఆయన. ఆయన ఈ రోజు ఉండి ఉంటే చాలా సంతోషించే వారు. మంచి మనుషులు ఎక్కువ కాలం ఉండరు అనడంకు ఇదే నిదర్శణం అన్నాడు.

ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ మాట్లాడుతూ.. మేఘాంశ్‌ నీతో ఈ సినిమా తీసిన వారిని ఎప్పటికి మర్చిపోకు. తొలి నిర్మాత దేవుడితో సమానం. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడికి ఎవరైనా రావచ్చు. శ్రీహరి గారి వల్ల ఎంతో మంది జీవితంలో సెటిల్‌ అయిన వారు ఉన్నారు. రాజకీయాల్లో కూడా ఆయన వల్ల సెటిల్‌ అయిన వారు ఉన్నారు. నాకు కూడా శ్రీహరిగారు సాయం చేశారు. ఆయన సాయం వల్లే నేను ఇలా ఉన్నాను అన్నారు.

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ.. నేను నిర్మాతగా మారానంటే కారణం శ్రీహరి గారే. నాకు ఇండస్ట్రీలో చాలా మంది పరిచయం అవ్వడంకు కారణం ఆయనే. ఆయన వల్లే చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన చాలా మందికి సాయం చేశారు. మహాసముద్రం లాంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు శ్రీహరిగారి అబ్బాయి ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. సినిమా పెద్ద విజయం సాధించి అందరికి మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను అన్నాడు.

డైరెక్టర్‌ రవి కుమార్‌ చౌదరి మాట్లాడుతూ.. 1994లో సాగర్‌ గారి 'అమ్మదొంగ' సినిమాకు అప్రెంటీస్‌ గా పని చేశాను. నాకు ఆ సమయంలో క్లాప్‌ కొట్టాలనే కోరిక ఉండేది. కాని క్లాప్‌ను వినాయక్‌ కొట్టేవాడు. మొదటి సారి నాకు శ్రీహరిగారి పై క్లాప్‌ కొట్టే అవకాశం వచ్చింది. సింగిల్‌ టేక్‌ లోనే ఆ షాట్‌ ఓకే అయ్యింది. ఆ రోజే నన్ను ఇండస్ట్రీని దున్నేస్తావంటూ శ్రీహరిగారు అన్నారు. శ్రీహరి గారు ఉండుంటే చాలా బాగుండేదంటూ తన అనుబంధంను చెప్పుకొచ్చాడు.