Begin typing your search above and press return to search.

అదితి బ్యూటీ అయితే అనూ హాటీ .. ఒకరిని మించినవాళ్లొకరు: అజయ్ భూపతి

By:  Tupaki Desk   |   10 Oct 2021 3:32 AM GMT
అదితి బ్యూటీ అయితే అనూ హాటీ .. ఒకరిని మించినవాళ్లొకరు: అజయ్ భూపతి
X
'మహా సముద్రం' సినిమా ఈ నెల 14న థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ భూపతి ఈ సినిమా విశేషాలను గురించి ప్రస్తావిస్తాడు. " ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ అద్భుతమైన ఆర్ ఆర్ ఇచ్చాడు. ఆడియన్స్ సెకండాఫ్ చూసి థియేటర్ బయటికి వచ్చిన ఒకటి రెండు రోజుల పాటు, నా సినిమాను గానీ .. వాటిలోని పాత్రలను గానీ .. ఆ పాత్రల స్వభావాలను గాని మరిచిపోలేరు. సినిమా స్టార్ట్ అయిన వెంటనే అక్కడ మీకు శర్వానంద్ కనిపించడు .. సిద్ధు .. అదితి .. అనూ .. రావు రమేశ్ .. జగపతిబాబు గారు .. ఎవరూ కనిపించరు. వాళ్ల పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.

రాసుకుంది నేను .. తీసింది నేను .. ముందుగా చూసుకున్నది కూడా నేనే కనుక అంత నమ్మకంగా చెబుతున్నాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగాలతో నిండిన కళ్లతో బయటికి వస్తారు. 'ఆర్ ఎక్స్ 100' సినిమా అప్పుడు నేను ఇలాగే చెబితే, 'ఎవడ్రా వీడు ఇంత ఓవర్ గా మాట్లాడుతున్నాడు' అనుకున్నారు. ఈ రోజున కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారో .. ఏమనుకుంటారో అనుకోండి. నా మహా సముద్రం సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. పోస్టర్ కూడా రెడీ చేసేసుకోండి.

నిర్మాత అనిల్ గారు అందించిన సహకారాన్ని నేను మరిచిపోలేను. ఇది ఒక డిఫరెంట్ లైనప్ లో ఉన్న కమర్షియల్ స్టోరీ. హీరోలకు అర్థమవుతుంది .. కానీ కమర్షియల్ విలువల గురించే ఆలోచన చేసే నిర్మాతలు అర్థం చేసుకోవడం కష్టం. అనిల్ గారు ఒకటే మాట అన్నారు . నేను ఈ జోనర్లో సినిమా తీయడం ఫస్టు టైమ్ .. కథ అదిరిపోయింది .. నీ మీద నమ్మకం ఉంది .. ముందుకు వెళ్లిపోండి" అన్నారు. నాకు బాగా గుర్తు .. ఆయన ఈ కథను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. అప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూనే ఉన్నాయి.

నిజంగా నేను ఈ సినిమాను చాలా హ్యాపీగా తీశాను. అందుకు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ కారణమే. అదంతా కూడా మీకు సినిమాలో కనిపిస్తుంది. ఫస్టు ట్రైలర్ రిలీజ్ చేయగానే అంతా బ్లాక్ బస్టర్ అన్నారు. సెకండ్ ట్రైలర్ దానికి మించి .. దాని బాబులా అనిపిస్తుంది. అదితి .. అను ఇద్దరూ కూడా చాలా గొప్పగా చేశారు. అదితి నాకు బ్యూటీ అయితే .. అనూ హాటీ. ఇద్దరూ ఏ మాత్రం తీసి పోరు .. ఒకరిని మించినవారు ఒకరు. వాళ్లను మించినవారు మా హీరోసు" అంటూ నవ్వేశారు. మళ్లీ చెబుతున్నాను .. అక్టోబర్ 14న వస్తున్నాం .. 'మహా సముద్రం' .. మీరు కొలవలేనంత లోతు ఉన్న ప్రేమను మీకు చూపించడానికి" అంటూ ముగించాడు.