Begin typing your search above and press return to search.
మరో దర్శకుడి ఓటీటీ ఎంట్రీ కన్ఫర్మ్
By: Tupaki Desk | 13 Oct 2021 12:30 AM GMTసౌత్ లో కూడా ఓటీటీ కంటెంట్ కు విపరీతమైన ఆధరణ పెరుగుతోంది. ప్రముఖ ఓటీటీలు అయిన ప్రైమ్ వీడియో.. నెట్ ఫ్లిక్స్.. హాట్ స్టార్ మరియు ఆహా లు పోటీ పడి మరీ వెబ్ సిరీస్ లు ఇంకా ఆసక్తికర షో లు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రముఖ దర్శకులను నటీ నటులను తమ వెబ్ సిరీస్ లకు ఇతర ప్రాజెక్ట్ లకు ఓటీటీ లు హైర్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు దర్శకులు ఓటీటీ ల కోసం వర్క్ చేశారు.. చేస్తూనే ఉన్నారు.. ముందు ముందు పలువురు ప్రముఖ దర్శకులు కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ ఎక్స్ 100 సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మహా సముద్రంను భారీ అంచనాల నడుమ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న దర్శకుడు అజయ్ భూపతి తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న మాట వాస్తవమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. నెట్ ఫ్లిక్స్ రూపొందించబోతున్న ఒక భారీ ప్రాజెక్ట్ లో భాగం అవ్వబోతున్నట్లుగా పేర్కొన్నాడు. కేవలం తాను మాత్రమే కాకుండా ఇంకా కొందరు దర్శకులు కూడా ఆ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అవుతారని చెప్పుకొచ్చాడు. నెట్ ఫ్లిక్స్ వారు ఇండియన్ మార్కెట్ ను పెంచుకునేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సౌత్ లోని అన్ని భాషలతో కలిపి హిందీ భాషలో కూడా డబ్ చేసే విధంగా ఒక భారీ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారట.
నెట్ ఫ్లిక్స్ వందల కోట్ల రూపాయలతో ఇండియన్ ఓటీటీ ప్రేక్షకుల కోసం కంటెంట్ ను రూపొందించే ప్రయత్నాలు చేస్తోంది. కేవలం హిందీ భాషపైనే ఫోకస్ పెట్టకుండా సౌత్ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేస్తున్న ఈ ఓటీటీ అజయ్ భూపతి వంటి ట్యాలెంటెడ్ దర్శకులకు భారీగా పారితోషికాలు ఇచ్చి మరీ వెబ్ సిరీస్ లను రూపొందిస్తుంది. మొత్తానికి ఓటీటీల్లో ప్రముఖ దర్శకులు కూడా ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల పంట పండినట్లు అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో నెట్ ఫ్లిక్స్ కు ప్రస్తుతానికి ఎక్కువ సంఖ్యలో ఖాతాధారులు లేరు. కాని రాబోయే రెండేళ్లలో అత్యధిక ఖాతాదారులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.