Begin typing your search above and press return to search.
ఆర్ ఎక్స్100..నిజజీవిత కథ..ఎవరిదంటే.?
By: Tupaki Desk | 1 Aug 2018 10:38 AM GMTఆర్ ఎక్స్ 100 మూవీ.. తాజాగా విడుదలైన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. పెట్టుబడికి ఐదారురెట్లు సంపాదించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఇదో నిజజీవిత కథ అని దర్శకుడు అజయ్ భూపతి తాజాగా చెప్పి సంచలనం సృష్టించాడు. అందుకే అంత కసిగా తీశానని.. దానికి ఫలితం వచ్చిందని తెలిపాడు.
శివ అనే తన ఫ్రెండ్ జీవితాన్నే ఆర్ ఎక్స్ 100 సినిమాగా తీశానని.. తన జీవితంలోని లవ్ ఫెయిల్యూర్ ఘటనలను కూడా సినిమాలో జోడించానని అజయ్ భూపతి వెల్లడించారు.
అజయ్ సైతం ప్రేమలో విఫమయ్యాడట.. ఒకనొక దశలో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడట.. ఇక జీవితం లేదనుకునే దశలో రాంగోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం రావడం.. ఆయన వద్ద పని చేయడంతో పూర్తి జ్ఞానం వచ్చిందట.. వర్మలోని కరుగుదనం తనను మార్చేసిందని చెప్పుకొచ్చాడు.
ఇలా నిజజీవిత కథనే సినిమాగా మార్చడంతో ప్రేక్షకులకు బాగా నచ్చిందని.. గ్రాండ్ హిట్ అయ్యిందని అజయ్ భూపతి తెలిపారు. ప్రస్తుతం తనను అమితంగా ప్రేమించే అమ్మాయి దొరికిందని.. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని అజయ్ తెలిపాడు. గతంలోని ప్రేమ ఇప్పుడసలు గుర్తుకే రావడం లేదని స్పష్టం చేశాడు.