Begin typing your search above and press return to search.
వర్మ నీచుడు.. శిష్యుడి కామెంట్!
By: Tupaki Desk | 30 July 2018 5:31 AM GMTవివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆయన శిష్యుడు షాక్ ఇచ్చాడు. వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పనిచేసి .. ఇటీవలే ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి తాజాగా వర్మపై చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆర్ఎక్స్ 100 గ్రాండ్ హిట్ అయ్యి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఓ కార్యక్రమంలో వర్మ ను ‘నీచుడు’ అంటూ కామెంట్ చేశాడు.
దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ‘వర్మను మించిన టెక్నీషియన్ దేశంలోనే లేరు. ఆయన మించిన దర్శకుడు కూడా లేడు. వ్యక్తిగతంగా ఆయనను మించిన నీచుడు ఎవరూ లేరు. అవతలి వ్యక్తిని కెలకడం.. కామెంట్ చేయడం నాకు నచ్చదు. అందుకే వర్మను నీచుడు అని అన్నారు’అని వివరణ ఇచ్చాడు.
వర్మ కామెంట్లపై కూడా అజయ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘ఎదుటి వారిని కెలికినప్పుడు వర్మను కిడ్నాప్ చేయాలి. కాళ్లు చేతులు కట్టేయాలి. కుర్చీకి కట్టేసి.. కళ్లు రెప్పలు వార్చకుండా క్లిప్పులు పెట్టేసి ఫ్యామిలీ సినిమాలు చూపించాలి. అలాంటి శిక్ష విధించాలి. కాకపోతే డైరెక్టర్ గా ఆయన నాకు దేవుడు ’ అని అన్నాడు.
తాను భవిష్యత్తులో బయోపిక్ తీయాలనుకుంటే వర్మ జీవితగాథను తెరకెక్కిస్తానని అజయ్ తెలిపాడు. వర్మ నీచమైన జీవితం.. డైరెక్టర్ గా ఆయన గొప్పతనం అన్నీ అందులో ఉంటాయని వెల్లడించాడు.