Begin typing your search above and press return to search.
ఆరెక్స్ 100 దర్శకుడు ఫిక్స్ అయ్యాడు
By: Tupaki Desk | 2 Sept 2019 2:49 PM ISTగత ఏడాది ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా ఒక్క సినిమా అనుభవం ఉన్న కార్తికేయను హీరోగా పెట్టి పాయల్ రాజ్ పుత్ తో ఇందూ పాత్ర ద్వారా సరికొత్త ప్రేమ కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు అజయ్ భూపతి దాని రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ విచిత్రంగా అతని కొత్త సినిమా మాత్రం ఇప్పటిదాకా మొదలుకాలేదు . మహాసముద్రం పేరుతో రాసుకున్న స్క్రిప్ట్ ఇప్పటికే కొందరు హీరోల వద్దకు వెళ్లి ఏవేవో కారణాల వల్ల కార్యరూపం దాల్చడం ఆలస్యమయ్యిందని ఫైనల్ గా మాస్ మహారాజా రవితేజ ఓకే చేశాడని టాక్ వచ్చింది.
త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని టాక్ ఉంది కానీ తాజాగా అది క్యాన్సిల్ అయ్యిందని అప్ డేట్. ఇప్పుడీ కథ మరో యూత్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఫ్రెష్ అప్ డేట్. కీలకమైన ఇంకో పాత్ర కోసం ఓ తమిళ హీరో గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
సో ఇది ఏ లెవెల్ మల్టీ స్టారరో ఆ ఇద్దరు హీరోలను ప్రకటించాకే తెలుస్తుంది. సున్నితమైన ప్రేమ కథను విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో ప్రెజెంట్ చేసేలా అజయ్ భూపతి సరికొత్తగా ఈ కథను రాసుకున్నాడట. అక్టోబర్ చివరి వారం నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ టీమ్ తో పాటు మొత్తం నటీనటుల వివరాలన్నీ త్వరలోనే ప్రకటించబోతున్నారు. మొత్తానికి ఏడాది పైగా గ్యాప్ తీసుకున్నా సరైన కథతోనే అజయ్ భూపతి వస్తున్నాడని సన్నిహితుల మాట