Begin typing your search above and press return to search.

వర్మ ఆడుగుజాడల్లో టీచర్స్ డే ఛీర్స్!

By:  Tupaki Desk   |   6 Sept 2018 10:10 AM IST
వర్మ ఆడుగుజాడల్లో టీచర్స్ డే ఛీర్స్!
X
ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరోదారట. సంచలనాలకు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ జనాలు తన గురించి ఏమనుకుంటారో అని పెద్దగా ఫీల్ కాడు.. కరెక్ట్ గా చెప్తే.. జనాలు అలా రియాక్ట్ అవ్వాలనే అదిపనిగా కామెంట్స్ చేస్తాడు. అయన పద్ధతి కొంతమంది జనాలకు నచ్చకపోవచ్చు... ఆయనలోని దర్శకుడు కూడా అవుట్ డేట్ అయ్యాడని అందరూ అనుకోవచ్చుగానీ అయన ఇండియన్ ఫిలిం మేకింగ్ కు ఒక 10,000 వోల్టుల షాక్ ఇచ్చి దాని దశ దిశను మార్చాడని మాత్రం అందరూ ఒప్పుకోవలసిందే.

అంతే కాదు అయన సినిమాలు చూసి ఎంతోమంది ప్రేరణ పొంది సినిమాల్లోకి వచ్చారు. ఇక అయన శిష్యులకు కొదవే లేదు. ఎంతోమంది ప్రముఖ డైరెక్టర్లు అయన శిష్యులే. మరి ఇంతమందికి టీచర్ అయినప్పుడు టీచర్స్ డే శుభాకాంక్షలు అందకుండా ఉంటాయా? తాజాగా వర్మ స్కూల్ నుండి చదువు పూర్తి చేసుకుని వచ్చి 'RX 100' తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ అజయ్ భూపతి తన గురువుకు టీచర్స్ డే శుభాకాంక్షలను గురువుగారి స్టైల్లోనే తెలిపాడు.

టీచర్స్ బాటిల్ ఫోటో ను పెట్టి అందులో గురువుగారి బొమ్మను మిక్స్ చేశాడు.. ఇక బ్యాక్ గ్రౌండ్ లో పాత కాలం నాటి టీచర్స్ మందు తయారు చేసే ఫ్యాక్టరీ ఫోటో ఉంది. దీంతో పాటు 'నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత' అనే ట్వీట్ పెట్టాడు. మరి ఆ మాత్రం క్రియేటివిటీ లేకపోతే వర్మ స్కూల్ అని తెలుస్తుంది? ఇవన్నీ ఒక ఎత్తైతే తన ప్రొఫైల్ పిక్ లో కూడా గురువుగారితో దిగిన ఫోటోను పెట్టుకున్నాడు. సహజంగా వాట్సాప్ గ్రూపుల్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పడు ఇలాంటివి షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ అజయ్ భూపతి మాత్రం వర్మ శిష్యుడు కదా. వర్మ రోబో అయితే ఈయన 2.0.. గురువుగారిని అయన స్టైల్ లోనే గౌరవించుకున్నాడు.