Begin typing your search above and press return to search.

మరో టాలీవుడ్ దర్శకుడికి కరోనా

By:  Tupaki Desk   |   12 Aug 2020 11:12 PM IST
మరో టాలీవుడ్ దర్శకుడికి కరోనా
X
దర్శకుడికి సామాన్యులు కరోనా నుంచి తప్పించుకోగలరేమో గాని... ప్రముఖులు తప్పించుకోవడం కష్టమేమో అనేలా ఉంది పరిస్థితి. ఇప్పటికే దేశంలో అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తాన్ని పలకరించి వచ్చిన కరోనా కొద్దిరోజుల క్రితం రాజమౌళి కుటుంబానికి సోకింది. దాదాపు తెలుగు సినీ ప్రముఖులంతా క్షేమంగా కోలుకుంటున్నారు.

తాజాగా RX100 దర్శకుడు అజయ్ భూపతి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. త్వరలో దాని నుంచి కోలుకుంటాను అన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు.ఇప్పటికే టాలీవుడ్లో రాజమౌళి, ఎస్పీ బాలసుబ్రమణ్యం, బండ్ల గణేష్, దర్శకుడు తేజ, సింగర్ స్మితలకు సోకింది... రాజమౌళి సహా దాదాపు అందరూ కోలుకున్నారు.

తాజాగా దీని బారిన పడిన అజయ్... కోలుకుని బయటకు వచ్చాక ప్లాస్మాదానం చేస్తానని ప్రకటించారు. ఈరోజే కరోనా నెగెటివ్ వచ్చిన రాజమౌళి కుటుంబం కూడా వైద్యుల సలహా మేరకు 15 రోజుల తర్వాత ప్లాస్మా దానం చేస్తామని ప్రకటించారు.