Begin typing your search above and press return to search.

గురువు ఏక్ నంబర్.. శిష్యుడు దస్ నంబర్

By:  Tupaki Desk   |   18 Aug 2018 10:54 AM GMT
గురువు ఏక్ నంబర్.. శిష్యుడు దస్ నంబర్
X
గురువు ఏక్ నంబర్ అయితే.. శిష్యుడు దస్ నంబర్.. అవును వారిద్దరి కామెంట్లు వింటుంటే అలాగే అనిపిస్తోంది. ఇంతకీ ఆ గురువు ఎవరో తెలుసా.. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆయన శిష్యుడు అజయ్ భూపతి..

ఇటీవల ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ ఆ సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. సినిమా అద్భుతంగా తీయడంలోనేకాదు.. అంతే స్థాయిలో వివాదాస్పద మాటలు మాట్లాడి అజయ్ గురువు వర్మను గుర్తుకు తెచ్చాడు. వర్మ తరహాలోనే బూతు మాటలు - వివాదాస్పద అంశాలను ఇంటర్వ్యూల్లో వెల్లడించి వార్తల్లో నిలిచాడు.

తాజాగా తన గురువు రాంగోపాల్ వర్మకు ‘భారత రత్న’ ఇవ్వాలంటూ అజయ్ భూపతి ట్విట్టర్ లో కామెంట్ చేసి దుమారం రేపాడు. దీనిపై స్వయంగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో స్పందించాడు. గురువు లాగా శిష్యుడూ ఉన్నాడని కామెంట్ చేశాడు.

ఇక వర్మకు భారతరత్నపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. కొందరేమో అజయ్ భూపతి తాగి కామెంట్ చేశావా అంటూ విసురుకున్నారు.. ఇంకొకరమో వర్మ లాంటి శాడిస్టుకి భరతరత్ననా అంటూ మండిపడ్డారు.

ఇక కొందరు పాజిటివ్ గానూ స్పందించారు. వర్మ ఇండియన్ ఫిలిం గర్వించే ఫిలిం మేకర్ అని.. సినీ రంగంలో ట్రెండ్ సెట్ చేసిన అతడికి భారతరత్నే కాదు.. మరేదైనా పెద్ద పురస్కారం ఇవ్వాలని కామెంట్ చేశారు. మరి ఈ కామెంట్స్ పై వర్మ స్పందిస్తాడా లేదా అన్నది వేచిచూడాలి.