Begin typing your search above and press return to search.
మళ్లీ పాయల్ పైనే భారం వేస్తున్నాడా?
By: Tupaki Desk | 20 Feb 2023 8:21 PM GMT'Rx100' డైరెక్టర్ మళ్లీ హీరోయిన్ పాయల్ పైనే భారం వేస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కార్తికేయ గుమ్మకొండ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కించిన 'Rx100' ఏ స్థాయి సంచనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే.
దర్శకుడిగా అజయ్ భూపతి కి మంచి గుర్తింపుని తెచ్చి పెట్టడంతో పాటు హీరో కార్తీకేయ గుమ్మకొండ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లకు ప్రత్యేకమైన గుర్తింపుని అందించింది. ఈ ముగ్గురి కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా నిలిచింది.
కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటన ప్రధాన హైలైట్ గా నిలిచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ కల్ట్ క్లాసిక్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి,హీరో కార్తికేయ గుమ్మకొండ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మళ్లీ ఆ స్థాయి సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోయారు. ఈ మూవీ తరువాత చాలా సినిమాల్లో నటించినా ఆ మార్కు మ్యాజిక్ ని మాత్రం రిపీట్ చేయలేకపోతున్నారు.
ఇదిలా వుంటే దర్శకుడు అజయ్ భూపతి తనదైన మ్యాజిక్ ని రిపీట్ చేయడం కోసం మరోసారి పాయల్ రాజ్ పుత్ నే నమ్ముకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అజయ్ భూపతి ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీకి శ్రీకారం చడుతున్నాడు. అజయ్ భూపతి స్వీయ దర్శకత్వంలో 'మంగళవారం' పేరుతో ఓ మహిళా ప్రధాన చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.
రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ సెట్ లోకి ప్రవేశించి నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ కీలక షెడ్యూల్ షూటింగ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతోంది. త్వరలోనే పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న విషయంలో పాటు ఈ మూవీ టైటిల్ ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుందట.
'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అజయ్ భూపతి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.