Begin typing your search above and press return to search.
RRR స్టార్ 400 కోట్ల బడ్జెట్ మూవీకి దర్శకత్వం?!
By: Tupaki Desk | 14 Sep 2021 5:30 PM GMTనటనలోనే కాదు కొందరికి దర్శకత్వంపైనా పిచ్చి వదలదు. ఆలో రౌండర్ నైపుణ్యాన్ని నిరూపించుకునేందుకు తహతహలాడతారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ఈ కేటగిరీకే చెందుతాడు. సినిమాల్లో నటిస్తూనే అజయ్ దేవగన్ తనకు నచ్చిన కథల్ని తెరపైకి తీసుకురావడానికి దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి `ఆర్.ఆర్.ఆర్`.. థ్రిల్లర్ డ్రామా `మేడే`తో పాటు మరికొన్ని చిత్రాల్లో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. హీరోగా మంచి స్థాయిలో వున్న అజయ్ వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీగా వున్నారు.
ఇంత బిజీగా వుంటూనే ఇంతకుముందు కూడా అజయ్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చేసిన సినిమాలు యు మీ ఔర్ హమ్- శివాయ్ ఓ మోస్తరుగా ఆడాయి. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లో `మేడే చిత్రం రూపొందుతోంది. ఇందులో బిగ్ బి అమితాబ్- రకుల్ ప్రీత్ సింగ్ - ఆకాంక్ష సింగ్- బోమన్ ఇరానీ నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో మరో చిత్రాన్ని అజయ్ దేవగన్ స్వీయదర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి దాదాపు రూ .400 కోట్ల బడ్జెట్ అంచనా వేశారని చెబుతున్నారు. అజయ్ తన మనస్సులో చాలాకాలంగా ఓ ప్రత్యేక కథ ఉందని దానిపై పని చేయాలని నిర్ణయించుకున్నాడని వెల్లడైంది.
ఈ చిత్ర కథ కోసం చాలా మంది రచయితలతో అజయ్ చర్చలు జరుపుతున్నాడు. తనే పూర్తి స్థాయి స్క్రీన్ ప్లేని రాసుకోవాలని భావిస్తున్నాడు. ఇది బలమైన భావోద్వేగాలతో కూడిన VFX ఆధారిత కథగా తెలుస్తోంది. ఇందు కోసం అజయ్ ప్రపంచవ్యాప్తంగా వున్నఅత్యుత్తమ టెక్నిషియన్ ల కోసం అన్వేషించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడట. ప్రస్తుతానికి ప్రారంభ దశలో ఉన్న ఈ మూవీ నిర్మాణ ప్రక్రియ వేగవంతం కానుందట. కోవిడ్ -19 సంక్షోభం సమీప భవిష్యత్తులో థియేట్రికల్ బజ్ పునరుద్ధరణతో పాటు ప్రస్తుత పరిస్థితుల మార్పుపై ప్రతిదీ ఆధారపడి ఉంటుంది.