Begin typing your search above and press return to search.
ఔను.. హీరోలు ఇలాంటివి చేయకూడదు
By: Tupaki Desk | 6 May 2019 11:33 AM GMTఈమద్య కాలంలో స్టార్ హీరోలు లెక్కకు మించిన కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. కొన్ని సెకన్ల యాడ్స్ లో కనిపించేందుకు కోట్ల పారితోషికం వస్తున్న నేపథ్యంలో ఏ హీరో మాత్రం బ్రాండ్ అంబాసిడర్ గా చేసేందుకు నో చెబుతాడు చెప్పండి. అందుకే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా దాదాపు అన్ని భాషలకు చెందిన ఎక్కువ శాతం హీరోలు వివిద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ చాలా ఏళ్లుగా పొగాకు ఉత్పత్తులు, పాన్ సంబంధిత ఉత్పత్తులు, మద్యం ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.
రాజస్థాన్ కు చెందిన నానక్ రామ్ హీరో అజయ్ దేవగన్ కు వీరాభిమాని, ఆ అభిమానంతో చాలా ఏళ్లుగా ఆయన ప్రమోట్ చేస్తున్న పొగాకు ఉత్పత్తులు, మద్యం, పాన్ సంబంధిత హానికర ప్రొడక్ట్స్ వాడే వాడు. చాలా ఏళ్లుగా నానక్ రామ్ ఆ ప్రొడక్ట్స్ వాడుతున్న కారణంగా తాజాగా అతడికి క్యాన్సర్ ఎటాక్ అయ్యింది. ఆ చెడు అలవాట్ల కారణంగానే నానక్ రామ్ కు క్యాన్సర్ ఎటాక్ అయ్యిందని వైధ్యులు తేల్చారట. దాంతో నానక్ రామ్ ఇకపై ఏ హీరో కూడా అలాంటి ప్రాడక్ట్స్ కు ప్రమోటర్స్ గా వ్యవహరించవద్దని కోరుకుంటున్నాడు.
నానక్ రామ్ కుటుంబ సభ్యులు వెయ్యి గోడ పత్రాలను ప్రింట్ చేయించి పలు ప్రాంతాల్లో వాటిని అంటించి విషయం అజయ్ దేవగన్ వరకు చేరేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇకపై అజయ్ దేవగన్ అలాంటి బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యహరించకుండా ఉండాలని వారు ఇలా చేస్తున్నారు. అజయ్ దేవగన్ మాత్రమే కాకుండా ఏ హీరో కూడా ఇలాంటి యాడ్స్ చేయకూడదని నానక్ రామ్ మరియు అతడి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కోట్లు కురిపించే యాడ్స్ ను స్టార్స్ వదులుకుంటారా అంటే అనుమానమే.