Begin typing your search above and press return to search.

కూతురిపై విమర్శలు.. అగ్రహీరో క్లారిటీ

By:  Tupaki Desk   |   11 Jun 2019 9:24 AM GMT
కూతురిపై విమర్శలు.. అగ్రహీరో క్లారిటీ
X
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్-కాజోల్ దంపతుల గారాల కూతురు నైసా.. ఈమె టీనేజ్ లో ఉన్నా ఈమె హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. నైసా ఫొటోలు, వార్తలపై ఇంటర్నెట్ లో నెటిజన్లు రకరకాలుగా విమర్శలు, కామెంట్లు విసురుతున్నారు. ఆమె వేసుకునే కురుచ దుస్తులు, వేషధారణపై కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు..

అయితే తన కూతురు ఇంకా సినిమాల్లోకి రాకముందే ఇలా వార్తల్లో నిలవడంపై ఆమె తండ్రి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ స్పందించారు. పనీపాటా లేక ఖాళీగా ఉండేవారే ఇలాంటి కామెంట్లు చేస్తుంటారని.. ఇలాంటి పనులు చేసే వారికి బుర్ర ఉండదని ఘాటుగా విమర్శించారు. నకిలీ ఖాతాల నుంచి ఇలాంటి పిరికి చర్యలు చేసే వారిని తాను కానీ.. తన కూతురు కానీ పట్టించుకోదని స్పష్టం చేశారు. అసలు అలాంటి వాటికి తాము ప్రాధాన్యం ఇవ్వమని చెప్పారు.

పిల్లల ఇష్టానుసారం ఉంటారని.. వారిపై బలవంతంగా నా ఆలోచనలు రుద్దనని అజయ్ దేవగన్ తెలిపారు. వారు సినిమా రంగంలోకి వస్తానన్నా తాను కాదనని స్పష్టం చేశారు. తన పిల్లలు చాలా చిన్నవారని.. ప్రస్తుతం చదువుకుంటున్నారని.. వారికి చదువు తప్ప మరే ఇతర ఆలోచనలు లేవని వెల్లడించారు.

తాను కూడా ఈ పిల్లల వేగాన్ని అందుకోలేకపోతున్నానని అజయ్ దేవగన్ పేర్కొన్నారు. అన్ని విషయాలను వారు త్వరగా నేర్చుకుంటున్నారని అన్నారు. సెల్ ఫోన్లో నాకు తెలియని విషయాలు కూడా తన కొడుకు యగ్ కు తెలుసు అని.. వాడు సెట్ చేస్తాడని అజయ్ చెప్పుకొచ్చాడు.