Begin typing your search above and press return to search.

#మీటూ : స్పందించి వేటు వేసిన స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   24 Oct 2018 11:13 AM GMT
#మీటూ : స్పందించి వేటు వేసిన స్టార్‌ హీరో
X
బాలీవుడ్‌ లో మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎంతో మంది సెలబ్రెటీలపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో నిజం ఎంతో, అబద్దం ఎంతో తెలియడం లేదు. అయితే కొందరు మాత్రం మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో వర్క్‌ చేసేందుకు నో అంటున్నారు. తాజాగా అజయ్‌ దేవగన్‌ తన టీంలో చాలా కాలంగా వర్క్‌ చేస్తున్న మేకప్‌ ఆర్టిస్టు ను లైంగిక ఆరోపణల కారణంగా తొలగించడం జరిగింది. మీటూ ఉద్యమ తీవ్రత నేపథ్యంలో అజయ్‌ దేవగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... ప్రస్తుతం అజయ్‌ దేవగన్‌ - టబుల కాంబినేషన్‌ లో ‘దే దే ప్యార్‌ దే’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఆ చిత్రానికి సహాయ దర్శకురాలిగా తాన్యా పాల్‌ సింగ్‌ ను అజయ్‌ దేవగన్‌ మేకప్‌ ఆర్టిస్టు హరీష్‌ వాధోన్‌ లైంగికంగా వేదించాడట. చిత్రం షూటింగ్‌ సందర్బంగా తన వెనుక నిల్చుని హరీష్‌ నీచంగా ప్రవర్తించాడు. మొదట ఎవరో అనుకున్నాను, వర్క్‌ బిజీగా ఉన్న నా వెనుక చేరి అతడు మళ్లీ మళ్లీ అసభ్యంగా ప్రవర్తించడంతో నిర్మాత లవ్‌ రంజన్‌ గారికి మొదట తెలియజేశాను అంటూ తాన్యా చెప్పుకొచ్చింది.

నిర్మాతతో కలిసి అజయ్‌ దేవగన్‌ కు ఈ విషయాన్ని చెప్పడంతో వెంటనే స్పందించి హరీష్‌ వాధోన్‌ ను తన టీం నుండి ఆయన తొలగించారు. అజయ్‌ దేవగన్‌ టీం మొత్తంలోకి హరీష్‌ పెద్ద వారు. ఆయన ఇలాంటి చిల్లర పనులు చేస్తాడని తాను భావించలేదని, ఆయన పనికి తాను చాలా ఇబ్బంది పడ్డట్లుగా తాన్యా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఒక స్టార్‌ హీరో మేకప్‌ ఆర్టిస్టు పై వేటు పడటంతో ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఈ విషయం హాట్‌ టాపిక్‌ అయ్యింది.