Begin typing your search above and press return to search.

షారూక్ కూతురు బాట‌లో దేవ‌గ‌న్ కూతురు..!

By:  Tupaki Desk   |   13 April 2022 3:30 AM GMT
షారూక్ కూతురు బాట‌లో దేవ‌గ‌న్ కూతురు..!
X
బాలీవుడ్ లో వ‌రుస‌గా న‌ట‌వార‌సుల వెల్లువ కొన‌సాగుతోంది. త‌దుప‌రి షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్.. శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషీ క‌పూర్ తెరంగేట్రానికి సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ మ‌న‌వ‌డు కూడా బ‌రిలో దిగుతున్నాడు. ఇంత‌లోనే ప్ర‌ముఖ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ వార‌సురాలు నైసా దేవ‌గ‌న్ ఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. నైసా దేవగన్ ఆకాంక్షలపై అజయ్ దేవగన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతే.. త‌ను ఈ లైన్ లోకి రావాలనుకుంటుందో లేదో నాకు తెలియదు.. అని అన్నారు.

అజయ్ దేవగన్ కూతురు నైసా దేవగన్ సోషల్ మీడియాలో ఇప్ప‌టికే సంచలనంగా మారుతోంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతా ప్రైవేట్ అయినా కానీ..త‌న‌ ఫోటోలు తరచుగా వైరల్ అవుతాయి. ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న నైసా విదేశాల్లో చదువుతోంది. అయితే ఆమె బాలీవుడ్ అరంగేట్రం గురించి ర‌క‌ర‌కాల‌ పుకార్లు ఉన్నాయి. అజయ్ ఇప్పుడు తాను న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం రన్ వే 34ని ప్రమోట్ చేస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్- బోమన్ ఇరానీ- రకుల్ ప్రీత్ సింగ్- అంగీరా ధర్ - ఆకాంక్ష సింగ్ త‌దిత‌రులు నటించారు.

మూవీ రిలీజ్ ప్రమోషన్స్ సమయంలో కాజోల్ అడుగుజాడలను నైసా కూడా అనుసరిస్తారా? అని అజయ్ దేవగన్ ని అడిగారు. నైసా ఈ లైన్ లోకి రావాలనుకుంటోందో లేదో నాకు తెలియదు. ఈ క్షణం వరకు ఆమె నిరాసక్తతను ప్రదర్శించింది. పిల్లల ఆలోచ‌న‌ల్లో ఎప్పుడైనా ఏదైనా మారవచ్చు. త‌ను విదేశాల్లో ఉంది. ప్రస్తుతం చదువుతోంది`` అని తాజా ఇంటర్వ్యూలో అజయ్ అన్నారు.

నైసా ఇప్పుడు స్విట్జర్లాండ్ లోని గ్లియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీలో డిగ్రీని అభ్యసిస్తోంది. నైసా గతంలో సింగపూర్ లోని ఉన్నత పాఠశాలలో మూడు సంవత్సరాలు చ‌దువుకుంది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తాజాగా నైసా ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. నైసా మనీష్ డిజైన్ చేసిన‌ గౌనుల్లో ఒకదానిని ధరించి క‌నిపించింది.

అజయ్ దేవగన్ రన్ వే 34 విడుద‌ల ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2015 నాటి వాస్తవమైన కథ ఆధారంగా రూపొందించారు. దోహా నుండి కొచ్చికి వెళ్లే జెట్ ఎయిర్ వేస్ విమానం ఉదయం తీవ్రమైన వాతావరణం .. తగినంత విజిబిలిటీ లేని కారణంగా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపుగా ల్యాండింగ్ ను కోల్పోతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే ఈ సినిమా.